iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ జంటకు ఇండిగో రూ.10 వేల పరిహారం..ఎందుకంటే..!

Indigo Airlines: ఇండిగో ఎయిర్ లైన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో ఈ సంస్థ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా హైదరాబాద్ జంటకు ఇండిగో విమానం 10వేలు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే..

Indigo Airlines: ఇండిగో ఎయిర్ లైన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక వివాదంతో ఈ సంస్థ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా హైదరాబాద్ జంటకు ఇండిగో విమానం 10వేలు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే..

హైదరాబాద్ జంటకు ఇండిగో రూ.10 వేల పరిహారం..ఎందుకంటే..!

నేటికాలంలో విమానాల్లో ప్రయాణాలు బాగా పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్లైట్ జర్నీ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో పలు ఎయిర్ లైన్స్ లు తమ సేవలను అందిస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రముఖ సంస్థ ఇండిగో తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. గతంలో ఓ ప్రయాణికుడి విమాన రద్దు విషయంలో సమాచారం ఇవ్వకపోవడంతో.. ఆ సంస్థకు గట్టిషాక్ తగిలింది. తాజాగా ఇదే సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించిన ఓ దంపతులకు రూ.10 వేలు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. మరి.. ఎందుకు, ఏమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2021లో భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకూ ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించారు. అయితే ఆ జర్నీ సమయంలో ఫ్లైట్ లో విమానంలో అపరిశుభ్రత కారణంగా భర్తకు వాంతులు అయ్యాయి.  దీంతో ఈ ఇష్యూపై బాధితుడి భార్య జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. విమానంలో అపరిశుభ్రత కారణంగా తన భర్త వాంతులు చేసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కోచ్‌లో చెత్త, ప్లాస్టిక్ సీసాలు, ఉపయోగించిన నాప్‌కిన్‌లతో నింపారని ఆమె ఆరోపించారు. ఆమె చేసిన ఫిర్యాదుపై కూడా అప్పట్లో ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ఆరోగ్య సమస్యలను ఎప్పుడు ప్రస్తావించలేదని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆరోపించింది. ఇదే సమయంలో ఇరుపక్షాల వాదనలు కోర్టు ఆలకించింది. చివరకు ఇండిగో సంస్థకు కీలక ఆదేశాలను జారీ చేసింది.

ప్రయాణికులు ఎక్కే ముందు ఇండిగో పరిశుభ్రత పాటించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది.  అపరిశుభ్రతకారణంగా ఇబ్బందికి గురైన ఆ దంపతులకు రూ. 10వేల పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. ఈ పరిహారం మొత్తం కూడా జులై 1 నుంచి 45 రోజుల్లోగా చెల్లించాలని  ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. గతంలో కూడా ఒక సారి ఇండిగో సంస్థకు ఇలాంటి జరిమానానే పడింది. తన ఫ్లైట్ రద్దు విషయం తెలియజేయనందుకు హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో అతడికి కూడా రూ.,30వేల పరిహారం చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను ఫోరం ఆదేశించింది. గడువు ముగిస్తే 12 శాతం వడ్డీతో చెల్లించాలని చెప్పింది. మొత్తంగా తాజాగా దంపతుల ఫిర్యాదు, వినియోగదారుల ఫోరం తీర్పుతో మరోసారి ఇండిగో సంస్థ వార్తల్లో నిలిచింది.