జాతీయ జెండాకు అవమానం! రౌడీ షీటర్‌ మృతదేహంపై..

జాతీయ జెండాకు అవమానం! రౌడీ షీటర్‌ మృతదేహంపై..

సాధారణంగా జాతీయ జెండాను సైనికుల పార్థీవ దేహాలపై, వారి శవపేటికలపై ఉంచుతుంటారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గౌరవార్థంగా అలా చేస్తారు. అలాగే గొప్ప నేతలు, స్వాతంత్ర్య సమరయోధులు మృతి చెందినప్పుడు కూడా జాతీయ జెండాను గౌరవార్థం వారి భౌతిక కాయాలపై కప్పుతారు. కానీ, తాజాగా హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఓ పేరుమోసిన రౌడీ షీటర్‌ మృతదేహంపై కూడా జాతీయ జెండాను ఉంచారు. దీనిని కొంతమంది తప్పుబడుతున్నారు. జాతీయ జెండాను అవమానించినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ఆ రౌడీ షీటర్‌ ఎవరూ? ఏంటి అనే వివరాల్లో వెళ్తితే..

పాతబస్తీ చంద్రాయణగుట్ట బార్కాస్​కు చెందిన పేరు మోసిన రౌడీ షీటర్ షేక్​ సయీద్​ బావజీర్​ను గురువారం హత్యకు గురయ్యాడు. అతని మృతదేహంపై స్థానికులు జాతీయ జెండాను ఉంటారు. అయితే.. బావజీర్‌ మజ్లీస్ పార్టీలో కొంతకాలం క్రితం వరకు యాక్టివ్‌ కార్యకర్తగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం బండ్లగూడ సమీపంలో ఓ రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. జల్​పల్లి మున్సిపాలిటీకి చెందిన పలు సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నాడు. పలు పార్టీల ప్రముఖ నేతలను ఉద్దేశించి విమర్శలు చేసేవాడు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ పలు పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు.

కానీ, చంద్రాయణగుట్ట పోలీసులు అతని ఫిర్యాదును పట్టించుకోలేదు. ఈ విషయం అంటుంచితే.. బావజీర్ వెంట ​భవానీనగర్‌కు చెందిన మరో రౌడీ షీటర్​ అహ్మద్​ బిన్​ హజబ్ తిరిగేవాడు. బావజీర్‌ చాలా కాలం నుంచి హోమో సెక్స్‌కు అలవాటు పడ్డాడు. దాని కోసం తన వద్దకు యువకులు తీసుకురావాలని అహ్మద్​ బిన్​ హజబ్‌ను పదేపదే ఒత్తిడి చేసేవాడు. కొన్నిసార్లు యువకులను కూడా పంపేవాడు హజబ్‌. గురువారం రాత్రి కూడా మరో యువకులను పంపాలని బావజీర్‌, హజబ్‌ను బెదిరించాడు. యువకులను పంపడం వీలు కాదని హజబ్‌ చెప్పడంతో నువ్వుఏ రావాలని బావజీర్‌ ఒత్తిడి చేశాడు. దీంతో తనకు అతనితో ప్రాణ హాని ఉందని భావించిన హజబ్​, కత్తితో బావజీర్​పై తీవ్రంగా దాడి చేశాడు. ఆ దాడిలో బావజీర్‌ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య, దాని వెనుక ఉన్న కారణాలు పక్కనపెడితే.. రౌడీ షీటర్‌ అయిన బావజీర్‌ మృతదేహంపై జాతీయ జెండా ఉంచడంపై వివాదం చెలరేగుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వైన్స్‌ వద్ద దోస్తుల మధ్య గొడవ.. ఒకరి హత్య!

Show comments