P Krishna
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించారు.
P Krishna
తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేసింది. డిసెంబర్ 7న తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం. ఇక రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా అర్హత ఉన్న వారికి రూ.10 లక్షల వరకు చేయూత పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి విపరీతమైన ఆదరణ వస్తుంది.. మహిళలు సంతోషంలో ఉన్నారు. ఇక ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన హామీ ఇచ్చారు. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్సె జెండర్లు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బస్ స్టాండ్స్ మహిళలతో రద్దీగా మారిపోయాయి. ఈ పథకం అమలు అయిన వారం రోజుల వరకు ఎలాంటి ఐడీలు లేకున్నా కండెక్టర్ జీరో టికెట్ మహిళలకు జారీ చేస్తారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా ప్రయాణించవొచ్చు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన మహిళలు.. ఎదైనా ఒక ఐడీ ఖచ్చితంగా చూపించాల్సిందే. ఒకవేల ఐడీ లేకపోతే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందే. అలా చేయకపోతే రూ.500 ఫైన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీకి భారీ ఆదాయం పెరిగినట్లు సమాచారం. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో 13 లక్షల మేర ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. ఇందులో దాదాపు 90 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. వాస్తవానికి దీని వల్ల ఆర్టీసీకి తీరని నష్టం వాటిల్లుతుందని జనాలు భావించారు. కానీ ఈ పథకం వల్ల ఆర్టీసీకి ప్రభుత్వ రియింబర్స్ మెంట్ కింద భారీ ఎత్తున డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో 13 నుంచి 14 లక్షల ఆదాయం రాగా, ఇప్పుడు 18 నుంచి 25 లక్షల వరకు పెరిగిందని.. ఈ లేక్కన ఆర్టీసి మంచి లాభాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ పథకం మొదలైనప్పటి నుంచి రోజూ 40 లక్ష మంది వరకు ప్రయాణం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ సిబంది జీరో టికెట్ ద్వారా ప్రభుత్వానికి లెక్కలు పంపితే.. వారు దాని ఆధారంగా రీయింబర్స్ పే చేస్తుందట. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.