iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్..కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు!

దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసింది. ఇక భారీ వరదల కారణంగా కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కాసేపట్లో వర్షం కురవనుంది. కాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవనుంది.

దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసింది. ఇక భారీ వరదల కారణంగా కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కాసేపట్లో వర్షం కురవనుంది. కాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవనుంది.

తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్..కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు!

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్య మధ్యలో కాస్త విరామం ఇచ్చినా తిరిగి కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అంతేకాక వివిధ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు వర్షం ముప్పు ఇంకా పోలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. అల్పపీడన ప్రభావంతో కాసేపట్లో  తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో మరికాసేపట్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే గతకొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలకు జనాలు అల్లాడిపోతున్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో అయితే నదులు, వాగులు పొంగిపొర్లాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు అయితే సముద్రాన్ని తలపించాయి. అంతేకాక వర్షం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ సమస్యతో వాహనాదారులు తెగ ఇబ్బంది పడ్డారు.

ఇది ఇలా ఉంటే.. బుధవారం సాయంత్రం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం పడుతుందని వాతారవణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల,వికారబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అంతేకాక వానపడే సమయంలో ఏదైనా అవసరమైతేనే తప్ప బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు.