Dharani
తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడమే కాక.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడమే కాక.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. జూన్ నెల ప్రారంభం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడం మొదలయ్యింది. ఇక జూలై నెల ప్రారంభం నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక భాగ్యనగరంలో ప్రతి రోజు ఏదో చోట వానలు కురుస్తూనే ఉన్నాయి. దాంతో నగర వాసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జూలై 7, 8 రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో రానున్న రోజుల్లో జోరు వానలు కురుస్తాయని.. హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు రెండు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. నేడు అనగా శనివారం నాడు రాష్ట్రంలోని వికరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వర్షాలతో పాటుగా గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. అలానే రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. కనుక జనాలు జాగ్రత్తగా ఉండాలని.. మరీ ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం బయటకు వచ్చే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలను హెచ్చరించారు. ఇక హైదరాబాద్ నగరంలో నేడు అనగా శనివారం సాయంత్రం నుంచి జోరు వాన కురుస్తుందని తెలిపారు. ఈనెల 8,9,10 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జోరు వాన కురిసింది. కొత్తపేట, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, హస్తినాపురం, ఉప్పల్, నాగోల్, రామాంతాపూర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని చోట్ల కి.మీ మేర ట్రాఫిక్ జామ్ కావటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.