Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గత కొద్ది రోజులుగా తెలంగాణలో వరుణుడు ఆన్ డ్యూటీలో ఉంటున్నాడు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తల్లు దుంకుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోత వానలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పొద్దున ఎండ, పగలు వానలు కురుస్తుండడంతో భిన్నమైన వాతావరణం నెలకొన్నది. తెలంగాణలో వానలు ఇప్పట్లో తగ్గేలా లేవు. మరో నాలుగు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం వరకు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సూచించింది. అలాగే.. బుధ, గురువారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సూచించింది.

Show comments