iDreamPost
android-app
ios-app

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. బయటకు రావొద్దంటూ!

IMD Hyderabad- Rain Alert For Telangana Districts: హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. 13 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే ఈదురు గాలులతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

IMD Hyderabad- Rain Alert For Telangana Districts: హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేశారు. 13 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే ఈదురు గాలులతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. బయటకు రావొద్దంటూ!

వర్షాకాలం నడుస్తున్నా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాస్త వర్షాలను నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అటు రైతుల్లో కూడా వర్షాల పట్ల కంగారు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే దైరాబాద్ వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది. అది కూడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని.. ఆ 13 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించింది. అలాగే హైదరాబాద్ నగర వాసులను కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉడాల్సిందిగా సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలి అంటూ సూచించారు.

వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ధ్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలపడినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ కి కూడా వర్ష సూచన ఉంది. దక్షిణ ఏపీ తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

Rains in hYd

ఈ ఆవర్తనం కారణంగా తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, ములుగు ఇలా మొత్తం 13 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ప్రజలను హెచ్చరించారు కూడా. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈదురుగాలుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచించారు.

గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పైగా పిడుగులు కూడా పడే అవకాశం ఉంది అన్నారు. రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, కరెంట్ పోల్స్ కింద, ఎత్తైన చెట్ల కింద ఉండకూడదని తెలిపారు. అలాగే హైదరాబాద్ ప్రజలకు కూడా పలు సూచనలు చేశారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది అన్నారు. సాయంత్రం మాత్రం వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి