iDreamPost

రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. ఇక వానలే వానలు!

IMD Hyderabad- Monsoon Rains: ఎండ వేడి, పగటిపూట ఉష్ణోగ్రత, ఉక్కపోతలకు ఇంక గుడ్ బై చెప్పే సమయం వచ్చేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

IMD Hyderabad- Monsoon Rains: ఎండ వేడి, పగటిపూట ఉష్ణోగ్రత, ఉక్కపోతలకు ఇంక గుడ్ బై చెప్పే సమయం వచ్చేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. వర్షాకాలానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. ఇక వానలే వానలు!

ఇన్నిరోజులు భానుడి భగభగలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అల్లాడిపోయారు. కానీ, ఇప్పుడు వాతావరణ శాఖ చల్లటి కబురు అందిస్తోంది. అదేంటంటే.. త్వరలోనే వర్షాలు వస్తున్నట్లు చెప్పేసింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ ను నైరుతి రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. ఇంక అతి త్వరలోనే ఆ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నైరుతి రుతుపవనాలు రానున్నాయి. అందుకు సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. అవి దాదాపుగా వర్షాకాలం వరకు కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలు సహా హైదరాబాద్ లో కూడా అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదారాబాద్ లో గత రెండ్రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న పశ్చిమ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సోమవారం నుంచి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే హైదరాబాద్ మహా నగరంలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇంక రుతుపవనాల విషయానికి వస్తే.. ఇప్పటికే అండమాన్ నికోబార్ ను రుతుపవనాలు తాకాయి. అలాగే త్వరలోనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.

Rains in HYD

ఇంక తెలంగాణకు జూన్ 8 నుంచి 11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా వాతావరణం చల్లపడింది. ఎలాగూ 24 వరకు వర్షాలు ఉండనే ఉంటున్నాయి. కాబట్టి ఇంకో రెండు వారాల్లో తెలంగాణలో వర్షాకాలం ప్రారంభమయ్యే ఆస్కారం కనిపిస్తోంది. కాబట్టి ఇన్నిరోజులు భానుడి ప్రతాపం చూసిన రాష్ట్ర ప్రజలు ఇంక వర్షాలతో చల్లబడనున్నారు. అయితే వర్షాలు వస్తున్నే నేపథ్యంలో రైతులు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఆదివారం రాష్ట్రంలో పిడుగు పాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందుకే వర్షాల సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రుతుపవనాల వార్త అందుకున్న రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణం కంటే ఈ ఏడాది ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అంతా అల్లాడిపోయారు. ఇప్పుడు వర్షాలు రానున్న నేపథ్యంలో కాస్త కుదుట పడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి