iDreamPost
android-app
ios-app

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు!

  • Published Sep 21, 2024 | 10:43 AM Updated Updated Sep 21, 2024 | 10:43 AM

Heavy Rains Alert: రాష్ట్రంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

Heavy Rains Alert: రాష్ట్రంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

  • Published Sep 21, 2024 | 10:43 AMUpdated Sep 21, 2024 | 10:43 AM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు!

తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా వర్షాలకు కాస్త బ్రెక్ వచ్చిందినుకునే లోపే.. మళ్లీ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే బంగాళాఖాతంలో ప్రస్తుతం ఆగ్నేయంగా వాయుగుండం ఏర్పడటం వల్లే.. మళ్లీ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవటానికి కారణమని వాతవరణ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొన్న విషయం తెలిపిందే. అంతేకాకుండా.. ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు నగరంలో నిన్న పగలంతా తీవ్రమైన ఎండకాసి, సాయంత్రానికి భారీ వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ( సెప్టెంబర్ 21) కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తాజాగా ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా ఆయా జిల్లాలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు.  ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పైగా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను సూచించారు. ఇదిలా ఉంటే.. ఈ అల్పపీడనం ఏపీకి కూడా ఉందని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, కర్నూలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. మరి, రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించడం పై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.