iDreamPost
android-app
ios-app

HYD వాసులకు అలర్ట్.. మళ్లీ మొదలైన భారీ వర్షం

  • Published Sep 06, 2024 | 5:54 PM Updated Updated Sep 06, 2024 | 5:54 PM

Hyderabad: ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు, వరద తీవ్రత నుంచి కొలుకుంటున్న తెలంగాణ ప్రజలకు తాజగా వాతవరణ శాఖ మరో బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. మరి కొన్ని నగరంలోని పలు ప్రాంతల్లో భారీ వర్షం కురవనుంది.

Hyderabad: ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు, వరద తీవ్రత నుంచి కొలుకుంటున్న తెలంగాణ ప్రజలకు తాజగా వాతవరణ శాఖ మరో బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. మరి కొన్ని నగరంలోని పలు ప్రాంతల్లో భారీ వర్షం కురవనుంది.

  • Published Sep 06, 2024 | 5:54 PMUpdated Sep 06, 2024 | 5:54 PM
HYD వాసులకు అలర్ట్.. మళ్లీ మొదలైన భారీ వర్షం

నగరంలో గత కొన్ని రోజులుగా కురిసిన కుండపోత వర్షాలు ఎంతటి భీభత్సం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ భారీ వర్షాలు వరదలు కారణంగా.. రహదారులన్ని జలమయమైయ్యాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి చాలామంది ప్రాణాలు సైతం పొగొట్టుకన్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లు కూడా కొట్టుకోపోయిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ భయంకరమైన విపత్తు నుంచి ఇంక ప్రజలు కోలుకోనే లేదు. కానీ, తాజగా నగర వాసులకు మరో వాతవరణ శాఖ మరో బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. నేడు రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుందని హెచ్చరించింది. మరి, ఆ వివరాలేంటో చూద్దాం.

హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే నగరంలో నల్లని మబ్బులతో ఆకాశం చీకటి కమ్మున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరీ కొన్ని గంటల్లో  మళ్లీ వర్షం లింగంపల్లి, మెహిదీపట్నం, గోల్కొండ, గండిపేట్, రాజేంద్రనగర్, ఖైరతబాద్,అమిర్ పేట్ జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, యూసఫ్ గూడ, ఖాజాగూడ, సరూర్ నగర్, ఎల్బీ నగర్,  తో పాటు పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురవనుంది. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు హెచ్చరించారు. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం కారణంగానే మళ్లీ వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ పేర్కొంది. ఇక దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎగువన విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఇది వచ్చే రెండు రోజుల్లో ఉత్తరం దిశ వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపింది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఇకపోతే ఈ వర్షాలు మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో కురవనున్నాయని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడిప్పుడే వరద తీవ్రత కొలుకుంటున్న నేపథ్యంలో.. మళ్లీ భారీ వర్షాలు కురవనున్నయని సమాచారం తెలియడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరీ, తెలంగాణ రాష్ట్రంలో మరోమారు భారీ వర్షలు కురవడం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.