Dharani
TG IMD 5 Days Rain Yellow Alert To 13 Districts: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రానున్న ఐదు రోజుల పాటు జోరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆ వివరాలు..
TG IMD 5 Days Rain Yellow Alert To 13 Districts: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. రానున్న ఐదు రోజుల పాటు జోరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆ వివరాలు..
Dharani
దేశ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఇక ఉత్తరాదిలో అయితే వర్ష బీభత్సం మాములుగా లేదు. భారీ వరదలు, ఉరుములు, పిడుగులతో జన జీవితం అస్తవ్యస్థం అయ్యింది. భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంటుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో వానలు దంచి కొడుతున్నాయి. అదలా ఉంచితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరు వానలు కురుస్తున్నాయి. ఈక్రమంలో వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..
నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేటి నుంచి అనగా జూలై 13 నుంచి 18 వరకు వానలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాక రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. కనుకు వ్యవసాయ పనులు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక ఇవాళ అనగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. మేఘాలు కమ్ముకొని ఉంటాయని అయితే వర్షం కురిసే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. శనివారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్‌లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దాంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే జూలై నెలలో మాత్రం వర్షాలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈనెలలో సగం రోజులు పూర్తి కాగా.. రానున్న 15 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఎలా ఉండనుందో చూడాలి.