iDreamPost
android-app
ios-app

క్రైమ్‌ డైరీస్‌లో 500వ ఇంటర్వ్యూ పూర్తి చేసిన ‘iDream’ మురళీధర్‌! ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

  • Published Sep 23, 2024 | 12:03 PM Updated Updated Sep 23, 2024 | 12:03 PM

iDream: ఐడ్రీమ్.. డిజిటల్ మీడియా రంగంలో అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా క్రైం డైరీస్ ఇంటర్య్వూస్ తో ప్రజల నుంచి విశేషమైన ఆదరణ పొందింది. ఈ క్రమంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కించుకుంది.

iDream: ఐడ్రీమ్.. డిజిటల్ మీడియా రంగంలో అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా క్రైం డైరీస్ ఇంటర్య్వూస్ తో ప్రజల నుంచి విశేషమైన ఆదరణ పొందింది. ఈ క్రమంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కించుకుంది.

క్రైమ్‌ డైరీస్‌లో 500వ ఇంటర్వ్యూ పూర్తి చేసిన ‘iDream’ మురళీధర్‌! ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

ఐడ్రీమ్ న్యూస్ ఛానల్ డిజిటల్ మీడియా రంగంలో ఓ సంచలనం. సమకాలీన అంశాలపై వార్తలను అందిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఐడ్రీమ్ తన ప్రత్యేకతను చాటుకున్నది. ప్రజల నుంచి విశేషమైన ఆదరణను చూరగొన్నది. తనకు తానే సాటి అన్నట్టుగా మీడియా రంగంలో దూసుకెళ్తోంది ఐడ్రీమ్. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ను అందిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఐడ్రీమ్. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రకరకాల ఇంటర్య్వూలను చేసి అందిస్తూ వారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ప్రజలకు అవగాహన కల్పించే ఇంటర్య్వూస్ చేస్తూ సమాజంలో క్రైం రేట్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది ఐడ్రీమ్. ముఖ్యంగా పోలీస్ ఇంటర్య్వూస్ కు బెస్ట్ ప్లాట్ ఫాంగా నిలిచింది ఐడ్రీమ్ న్యూస్ ఛానల్. ఈక్రమంలో క్రైం డైరీస్ 500వ ఎపిసోడ్స్ చేస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్నది. తాజాగా క్రైం డైరీస్ 500వ ఎపిసోడ్ ను తెలంగాణ డీజీపి జితేందర్ లాంచ్ చేశారు.

పోలీస్ జాబ్ అంటే నిత్యం ముళ్ల మీద నడక మాదిరిగానే ఉంటుంది. పోలీస్ అనే వ్యక్తి యూనిఫాంలో ఉన్న సివిలియన్. పోలీస్ ను చూస్తే మంచోడికి ధైర్యం, చెడ్డొడికి భయం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా వేసి రక్షణగా నిలుస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పోలీస్ పర్సనల్స్ ను ఇంటర్య్వూలకు పిలిచి విధి నిర్వహణలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, వారు ఆ స్థాయికి చేరుకోవడానికి పడ్డ కష్టం ఇలంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో పోలీస్ ఇంటర్య్వూస్ ను నిర్వహిస్తున్నది ఐడ్రీమ్ న్యూస్ ఛానల్. ఈ ఇంటర్వ్యూస్ నిర్వాహకుడిగా మురళీధర్ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికి 499 ఇంటర్వ్యూలను చేసి 500వ ఎపిసోడ్ కు సిద్ధమయ్యారు.

Idream MD

దీనికి సంబంధించిన ప్రోమోను తెలంగాణ డీజీపీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైం డైరీస్ 500 ఎపిసోడ్స్ చేయడం సాధారణ విషయం కాదని తెలిపారు. దీని వెనకాల కఠోరమైన కృషి చేసిన మురళీధర్ ను అభినందించారు. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కు స్ట్రెంత్స్ అండ్ స్టైల్ ఉంటుంది. ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. పోలీస్ ఇంటర్య్వూలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూశానని డీజీపీ వెల్లడించారు. ఇదొక గొప్ప పని అని అందుకు మురళీధర్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా దీనంతటికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న ఐడ్రీమ్ చైర్మన్ వాసుదేవరెడ్డిని డీజీపీ అభినందించారు. ఈ క్రమంలో ఐడ్రీమ్ న్యూస్ ఛానల్ మరో ఘనతను సాధించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది ఐడ్రీమ్ నిర్వహించిన క్రైం డైరీస్. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ను ఇండియన్ బుక్ ఆఫ్ ప్రతినిధులు ఐడ్రీమ్ అధినేత వాసుదేవరెడ్డికి అందించారు. అదేవిధంగా 500 ఎపిసోడ్స్ నిర్వహించిన మురళీధర్ కు కూడా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టీఫికేట్ అందించారు. ఈ సందర్భంగా 500 కాదు 1000 ఎపిసోడ్స్ మైలురాయిని కూడా మూడేళ్లలో అందుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు.