iDreamPost
android-app
ios-app

హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఆ ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

  • Published Aug 30, 2024 | 11:42 AM Updated Updated Aug 30, 2024 | 11:42 AM

HYDRAA: నగరంలోని హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నగరంలో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ఆ ఆరుగురు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

HYDRAA: నగరంలోని హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నగరంలో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ఆ ఆరుగురు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Aug 30, 2024 | 11:42 AMUpdated Aug 30, 2024 | 11:42 AM
హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఆ ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

హైదరాబాద్ నగరంలో హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. కాగా, ఇప్పటికే రాష్ట్రంలోని సంచలనంగా మారిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం అధ్వర్యంలో.. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టిన హైడ్రా తాజాగా ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమలోనే.. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ హైడ్రా సిఫారసు చేసింది. అంతేకాకుండా..హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం వెలువడింది ఆ వివరాళ్లోకి వెళ్తే..

నగరంలోని హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నగరంలో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ఆరుగురు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే వారిలో జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు హెచ్ఎండీయే అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్ పై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. కాగా, ఇప్పటికే ఈ విషయంలో.. హైడ్రా కమిషనర్​ రంగనాథ్, చాలా సీరియస్​‌గా ఉన్నారు. అయితే మొదట్లోనే చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన అన్ని విభాగాలకు లేఖలు రాశారు. ఇక అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ అక్రమ నిర్మాణలకు అనుమతి ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినెల్ కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్ కు రంగనా హైడ్రా కమిషనర్​ అన్నట్లుగానే ఆరుగురు అధికారులపై క్రిమినల్​కేసులు పెట్టాలని సైబరాబాద్​కమిషనర్‌​కు రంగనాథ్​ సిఫారసు చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే బాచుపల్లి ఎర్రకుంటలో అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలను హైడ్రా ఇటీవలే నేలమట్టం చేసింది. అంతేకాకుండా.. ఇప్పటివరకు ఇలా 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. అలాగే మరో 50 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువులు భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో పాటు గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్​‌పైనా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఇలా అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులను ఎవరిని ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిన అధికారుల్లో ఆందోళన మొదలైంది.