వీడియో: ఏకంగా చెరువులోనే 4 అంతస్థుల బిల్డింగ్‌.. బాంబులతో కూల్చిన హైడ్రా! ఎక్కడంటే..

HYDRA Demolitions: ప్రస్తుతం తెలంగాణాలో హైడ్రా కూల్చివేతలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద చెరువులలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. వీరిలో ఓ వ్యక్తి చాలా తెలివిగా ఏకంగా చెరువులో నాలుగు అంతస్థుల బిల్డింగ్ నిర్మించాడు. మరి దానిని హైడ్రా అధికారులు ఏ విధంగా కూల్చేశారో చూద్దాం.

HYDRA Demolitions: ప్రస్తుతం తెలంగాణాలో హైడ్రా కూల్చివేతలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద చెరువులలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. వీరిలో ఓ వ్యక్తి చాలా తెలివిగా ఏకంగా చెరువులో నాలుగు అంతస్థుల బిల్డింగ్ నిర్మించాడు. మరి దానిని హైడ్రా అధికారులు ఏ విధంగా కూల్చేశారో చూద్దాం.

హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ కట్టడాల పైన హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపిస్తే అక్కడ.. క్షణాల్లో భవనాలను నేలమట్టం చేస్తూ వస్తున్నారు. కొన్ని వందల కోట్లు విలువ చేసే విల్లాలను , వ్యాపార సంస్థలను హైడ్రా నేల మట్టం చేస్తుంది. ఎంతో మంది కోటీశ్వరులు విలాసవంతమైన జీవితాల కోసం చెరువులను కబ్జా చేసి.. అక్రమ నిర్మాణాలను చేపట్టారు. లేక్ వ్యూస్ అంటూ లగ్జరీలకు పోయి.. కొంతమంది ఏకంగా చెరువులలోనే బిల్డింగ్ లను నిర్మిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిలా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో.. ఓ వ్యక్తి ఏకంగా నాలుగు అంతస్థుల బిల్డింగ్ ను నిర్మించాడు. దానిని హైడ్రా అధికారులు రెవిన్యూ సిబ్బంది క్షణాల్లో నేలమట్టం చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు కొన్ని పేలుడు పదార్థాలను ఉపయోగించి ఆ బిల్డింగ్ ను కూల్చేశారు. ఇప్పటివరకు కూల్చేసిన భవనాలు కనీసం చెరువు ఒడ్డున అయినా ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఏకంఫా చెరువులోని ఉంది.. పైగా ఆ బిల్డింగ్ దగ్గరకు చేరుకోవడానికి స్కైవాక్ రేంజ్ లో మెట్లను కూడా నిర్మించారు. నీటిలోనే పిల్లర్స్ ను నిర్మించి.. G+1 నుంచి నాలుగు అంతస్తుల్లో భవనం కట్టేసాడు ఆ పెద్ద మనిషి. ఆ బిల్డింగ్ కట్టిన తీరు చూసి.. అక్కడ ఉన్న స్థానికులు , అధికారులు ఆశ్చర్యపోయారు. సికింద్రాబాద్ కు చెందిన ఓ కోటీశ్వరుడు దాదాపు పదేళ్ల క్రితమే.. ఈ బిల్డింగ్ ను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఆ యజమాని వీకెండ్స్ లో సరదాగా కుటుంబంతో గడిపేందుకు అక్కడకు వస్తుంటారని వెల్లడించారు. దీనితో అక్రమంగా చెరువును కబ్జా చేసి.. నిర్మించిన ఆ బిల్డింగ్ ను.. నీటి లోపల పిల్లర్స్ కు బాంబులను అమర్చి బిల్డింగ్ మొత్తం నేలమట్టం చేశారు.

అయితే ఈ కూల్చివేత పనుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందచేశారు. అయితే ఇప్పుడు హైడ్రా స్పీడ్ పెంచి దూసుకుపోతూ ఉంది. అలాగే దీనిపై కొంతకాలంగా వివాదం కూడా నడుస్తూ ఉంది. పెద్ద పెద్ద వారి ఇళ్లను వదిలేసి.. పేద వాళ్ళ ఇళ్లను మాత్రం కూల్చివేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై అందరికి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇలా చెరువులలో నిర్మించిన బిల్డింగ్స్ ను కూల్చివేయడంలో తప్పు లేదని చాలా మంది భావిస్తున్నారు. ఇలా చెరువులకు సమీపంలో నిర్మాణాలు చేపడితే.. హైదరాబాద్ కు రానున్న రోజుల్లో ముప్పు ఉండడం ఖాయం.. కనుక ఇలా చేయడం కూడా సరైన పద్దతే అని మరికొంతమంది.. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments