iDreamPost
android-app
ios-app

ఇకపై చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా ప్రత్యేక దృష్టి!

  • Published Oct 23, 2024 | 11:26 AM Updated Updated Oct 23, 2024 | 11:26 AM

HYDRA: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమించి కట్టిన కట్టడాలు కూల్చివేసేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు.

HYDRA: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమించి కట్టిన కట్టడాలు కూల్చివేసేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు.

  • Published Oct 23, 2024 | 11:26 AMUpdated Oct 23, 2024 | 11:26 AM
ఇకపై చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా ప్రత్యేక దృష్టి!

హైదరాబాద్ లో నీటి వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో పేదలను అడ్డుపెట్టుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్నో మోసాలకు తెగబడ్డారు. చెరువుల భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పపడినట్టు గుర్తించామన్న హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 వరకు అందించిన నగర పరిధిలోని దాదాపు 56 చెరువుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించగా..అందులో కొన్ని 60 శాతం, మరికొన్ని 80 శాతం మేర కబ్జాలకు గురైనట్లు రంగనాథ్ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కబ్జాదారులు చెరువులను ఆక్రమించి హైదరాబాద్ ప్రమాదంలోకి నెడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా తొలి ప్రాధాన్యతగా చెరువుల పరిరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటీవల న‌గ‌ర ప‌రిధిలోని చెరువుల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా ఇప్పుడు వాటి పునరుజ్జీవనంపై దృష్టి పెట్టింది.  చెరువుల పరిరక్షణ కోసం మూడు దశల్లో పని చేయబోతున్నట్లు ప్రకటించింది హైడ్రా ప్రకటించింది. మొదటి దశలో ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని పూర్తిగా కట్టడి చేయడం. రెండవ దశలో చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చి వేయడం, మూడో దశ గొలుసు కట్టు చెరువులకు ప్రాణం పోసేలా నాలాలను పరిరక్షించి, చెరువుల్లో పూడికలు తీసివేయడం అన్నారు రంగనాథ్. ఈ క్రమంలోనే నిజాం పేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ కు చేరువ లో ఉన్న ఎర్రకుంట చెరువుతో మొదట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు హైడ్ర కమీషనర్ రంగనాథ్.

ఆగస్టు 14 న ఇక్కడ నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. కూల్చివేత అనంతరం నిర్మాణానికి వాడిన ఐరన్, ఇతర సామాన్లు యజమాని పట్టుకువెళ్లారు. మిగతా వ్యర్థాలను తొలగించకపోవడంతో సదరు యజమానిపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న నిర్మాణ వ్యర్థాలను హైడ్రా అధికారులు తొలగించే పనులు మొదలు పెట్టారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ పనులు పూర్తి చేయనున్నారు.తర్వాత హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ చెరువుకు పునరుజ్జవనం కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అన్ని చెరువుల్లో పునరుజ్జవనం పనులు చేపట్టనన్నట్లు రంగనాథ్ తెలిపారు.