iDreamPost
android-app
ios-app

HYDRAపై డిప్యూటీ CM భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆపకపోతే..!

Bhatti Vikramarka On HYDRA And Musi Project: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైడ్రా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ విషయంలో కూడా ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హైడ్రా, మూసీకి సంబంధించి ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి అన్నారు.

Bhatti Vikramarka On HYDRA And Musi Project: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైడ్రా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ విషయంలో కూడా ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హైడ్రా, మూసీకి సంబంధించి ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి అన్నారు.

HYDRAపై డిప్యూటీ CM భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆపకపోతే..!

హైడ్రా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు వస్తున్న అంశం. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. హైడ్రాకు చట్టబద్ధత కలిగించేందుకు కూడా కార్యచరణ ప్రారంభమైంది. చట్టబద్ధత కల్పించడమే కాకుండా.. మరిన్న అధికారులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రతిపక్షం మాత్రం హైడ్రా వల్ల పేదలు, ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయి అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ విషయంలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా హైడ్రా ఆవశ్యకత, మూసీ సుందరీకరణ అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సోమవారం భట్టి విక్రమార్క సెక్రటేరియట్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలోనే కాకుండా.. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. వీటిల్లో ఎక్కడా వ్యక్తిగత అజెండా లేదు అని క్లారిటీ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ” హైడ్రాని తీసుకొచ్చింది సీఎం కోసమే.. మంత్రుల కోసమో కాదు కదా? ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. హైదరాబాద్ అంటేనే లేక్స్- రాక్స్- పార్క్స్. కానీ, ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాంటి చెరువులు కనిపించడం లేదు. హైదరాబాద్ లోని చెరువులు ప్రజల ఆస్తి. హైదరాబాద్ నగరంలో దాదాపు 20 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయమవుతున్నాయి. విభజన సమయానికి హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి? అనే అంశాలను సేకరిస్తున్నాం. చెరువులు కబ్జా కాకూడదు అనేదే మా అజెండా. 2014కు ముందు ఉన్న చెరువులు ఇప్పుడు కనిపించడం లేదు. చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి.

batti 2

ఆక్రమణలకు సంబంధించి కూడా శాటిలైట్ చిత్రాలను తీసుకొచ్చాం. 2014కు ముందు ఉన్న చెరువులు.. ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు ఆ చిత్రాల్లో చూడచ్చు. కొన్ని చెరువులు పాక్షికంగా.. మరికొన్ని చెరువులు సగానికిపైగా.. ఇంకొన్ని చెరువులు పూర్తిగా కబ్జా కాబడ్డాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు చెరువులు ఉండవు. ఇప్పుడు ఈ కబ్జాలను ఆపకపోతే భవిష్యత్ లో ఇంక ఏమీ మిగలదు. చెరువులు ఆక్రమణ హైదరాబాద్ కు పెను ప్రమాదంగా మారబోతోంది. హైడ్రాకి సంబంధించి ప్రజలకు వాస్తలు తెలియాలి. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు” అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ విషయంలో కూడా భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. “మూసీ ప్రక్షాళన ప్రజా శ్రేయస్సు కోసమే. చిన్న వర్షం పడినా ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రాజెక్ట్ విషయంలో తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మూసీ సుందరీకరణ అంశంలో ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవు. ప్రజా శ్రేయస్సే మా అజెండా” అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైడ్రా.. మూసీ ప్రాజెక్ట్ విషయంలో భట్టి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.