iDreamPost
android-app
ios-app

హైడ్రా షాక్.. నిమిషాల వ్యవధిలో రూ.60 కోట్ల విలువైన విల్లాలు ఔట్!

  • Published Sep 24, 2024 | 2:01 PM Updated Updated Sep 24, 2024 | 4:03 PM

HYDRA: హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చెరువులు,నాలాలు, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల  పరిధిలో నిర్మించిన భవనాల పై హైడ్రా ఏ స్థాయిలో కొరడా ఝుళిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా హైడ్రా నిమిషాల వ్యవధిలోనే రూ.60 కోట్ల విల్లాలను కూల్చివేసింది. మరి, ఆ వివరాలేంటో చూద్దాం.

HYDRA: హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చెరువులు,నాలాలు, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల  పరిధిలో నిర్మించిన భవనాల పై హైడ్రా ఏ స్థాయిలో కొరడా ఝుళిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా హైడ్రా నిమిషాల వ్యవధిలోనే రూ.60 కోట్ల విల్లాలను కూల్చివేసింది. మరి, ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 24, 2024 | 2:01 PMUpdated Sep 24, 2024 | 4:03 PM
హైడ్రా షాక్..  నిమిషాల వ్యవధిలో రూ.60 కోట్ల విలువైన విల్లాలు ఔట్!

మొన్నటి వరకు వరదలతో ఉక్కిరిబిక్కిరి వాతావరణం ఎదుర్కొన్న హైదారాబాద్ ప్రజలకు.. ఇప్పుడు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎవరు ఎప్పుడు నోటిసులు పంపిస్తారో, ఏ వైపు నుంచి హైడ్రా అధికారులు తమ బుల్డోజర్ తో వస్తారో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఈ హైడ్రా ధనవంతులపై ఉక్కుపాదం మోపుతుందో.. పేద వారిపై విరుచుకు పడుతుందో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే.. నగరంలో చాలామంది మధ్య తరగతి కుటుంబలు ఈ హైడ్రా చేస్తున్న చర్యలకు అర్ధాంతరంగా రోడ్డున పడుతున్నారు. లక్షలకు లక్షలు బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని ఎంతో ఇష్టంగా నిర్మించుకుంటున్నా, కొనుక్కుంటున్న భవనాలను హైడ్రా నిర్ధాక్ష్యణంగా కూల్చివేయడంతో..తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

కళ్ల ముందే తమ కష్టమంత బుడిదలో పోసిన పన్నీరులా మారిపోతుందని బోరున విలపిస్తున్నారు. కనీసం నిడవ నీడ కూడా లేకుండా.. కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఏ మాత్రం కనికరం లేకుండా.. హైడ్రా అక్రమ నిర్మాణలను కూల్చివేయడంలో మరీంత దూకుడు పెంచింది. అయితే హైడ్రా మాత్రం అక్రమంగా నిర్మాణాలను చేపట్టిన వారిని టార్గెట్ చేసింది. ఈ క్రమంలో కొందరు తెలియక ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్థలాలను కొనుగోలు చేసి..ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా మాత్రం తనపని తాను చేసుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా హైడ్రా 6 నిమిషాల వ్యవధిలోనే రూ.60 కోట్ల విలువ చేసే విల్లాలను కూల్చివేసింది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చెరువులు,నాలాలు, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల  పరిధిలో నిర్మించిన భవనాల పై హైడ్రా ఏ స్థాయిలో కొరడా ఝుళిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హైడ్రా చేపడుతున్న ఈ చర్యలు కక్ష పూరితంగా ఉన్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. బడా బాబులు అక్రమించిన ఇళ్లను కూల్చివేయకుండా.. పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న సామాన్యుల బతుకులపై విరుచుకుపడుతుందని మండిపడుతున్నారు. అయితే ఈ మధ్య కాస్త కూల్చివేతలలో వెనక్కి తగ్గిన  హైడ్రా.. మళ్లీ తన దూకుడును పెంచింది.  ఇటీవలే సంగారెడ్డి జిల్లాలోని అమీనాపూర్ మున్సిపాలిటి పరిధిలో అన్ని రకాలుగా లీగల్ డాక్యూమెంట్స్ ఉన్నాయని చెప్పిన సరే ప్రభుత్వ స్థలాలను అక్రమించారంటూ.. రాత్రికి రాత్రి హైడ్రా అధికారులు నిర్ధాక్ష్యణంగా 25 విల్లాలను కూల్చివేసింది.

ఇలా నిమిషాల వ్యవధిలోనే రూ.60 కోట్ల విల్లాలు మొత్తం నేలమట్టమైయ్యాయి.  అలాగే పటేల్ గుడాలలో కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని భవనాలు నిర్మించారనే నేపథ్యంలో.. 16 విల్లాలను కూల్చివేసింది. అంతేకాకుండా.. కూకటపల్లి నల్ల చెరువును కూడా ఆక్రమించి మరీ విల్లాలను చేపట్టారు. ఇలా ఇప్పటికే  అయితే గత ప్రభుత్వంలో అధికారులు  పర్మిషన్ ఇచ్చి, బ్యాంకులు లోన్స్ ఇస్తేనే ఇలా  కష్టపడి భవనాలను నిర్మించుకుంటున్నమని, అయితే ఇలా ఉన్నట్టుండి అక్రమ ఆస్తులు అంటూ కూల్చివేయడం ఎంత వరకు కరెక్ట్ కాదంటూ ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వ మారినప్పుడల్లా ఇలా కొత్త రూల్స్ మారుతూ ఉంటే మాలాంటి సామన్యులు ఎలా బ్రతకాలంటూ ప్రజలు వాపోతున్నారు. మరి, నిమిషాల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో సుమారు రూ.200 కోట్లకు పైగా విలువ చేసే భవనాలను హైడ్రా నిర్ధాక్ష్యనంగా కూల్చివేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.