Dharani
Vinayaka Chavithi 2024-Rules For Ganesh Pandal: మరో పది రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ఈ నేపథ్యంలో మండపాలు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునేంటే ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు పోలీసులు. ఆ వివరాలు..
Vinayaka Chavithi 2024-Rules For Ganesh Pandal: మరో పది రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ఈ నేపథ్యంలో మండపాలు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునేంటే ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు పోలీసులు. ఆ వివరాలు..
Dharani
తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పండగల సీజన్ ప్రారంభం అయ్యింది. నేడు అనగా ఆగస్టు 26, సోమవారం నాడు కృష్ణాష్టమి పండుగ. ఇది పూర్తైన పది రోజుల్లోనే హిందువులు జరుపుకునే అతి పెద్ద పర్వదినం వినాయక చవితి వస్తుంది. ఇక గణేష్ ఉత్సవాలు అంటే గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా ఎంతో ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఊరువాడా.. బొజ్జ గణపయ్య నామ స్మరణతో మార్మోగిపోతుంది. మండపాలు ఏర్పాటు చేసి.. తొమ్మిది రోజుల పాటు నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజించి.. ఆ తర్వాత లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే నెల 17న మహా నిమజ్జన ఉరేగింపు కార్యక్రమాలు ఉంటాయి.
ఒకప్పుడు వినాయక చవితి అంటే ఊరంతా కలిపి ఒక్క విగ్రహం పెట్టేవారు. మరి ఇప్పుడో వీధికో విగ్రహం అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. ఇక నగరాల్లో అయితే కాలనీలో 2, 3 చోట్ల గణేష్ మండపాలు దర్శనం ఇస్తాయి. అయితే వినాయక మండపాలు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మండపం ఏర్పాటు చేయాలంటే.. ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అలానే మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలని నిర్వాహకులు, ఉత్సవ కమిటీలను సీపీ కోరారు.