iDreamPost
android-app
ios-app

సికింద్రాబాద్‌లో 25 లక్షలకే ఫ్లాట్! ఇంతకంటే తక్కువ ధరకి దొరకదు

  • Published Aug 08, 2024 | 5:07 PM Updated Updated Aug 08, 2024 | 5:16 PM

Flat Prices in Secunderabad Area: తక్కువ ధరకే ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. సికింద్రాబాద్ లో 25 లక్షలకే ఫ్లాట్ అందుబాటులో ఉంది. ఇంతకంటే తక్కువ ధరకు దొరకడం కష్టం. 1020 చదరపు అడుగుల ఫ్లాట్ అది. కొనాలన్నా ఉద్దేశం ఉంటే కనుక ఈ కథనం పూర్తిగా చదివేయండి. 

Flat Prices in Secunderabad Area: తక్కువ ధరకే ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. సికింద్రాబాద్ లో 25 లక్షలకే ఫ్లాట్ అందుబాటులో ఉంది. ఇంతకంటే తక్కువ ధరకు దొరకడం కష్టం. 1020 చదరపు అడుగుల ఫ్లాట్ అది. కొనాలన్నా ఉద్దేశం ఉంటే కనుక ఈ కథనం పూర్తిగా చదివేయండి. 

సికింద్రాబాద్‌లో 25 లక్షలకే ఫ్లాట్! ఇంతకంటే తక్కువ ధరకి దొరకదు

హైదరాబాద్ లో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం అనేది ఎంతోమంది కల. అయితే భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో కొనాలన్నా కల కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి వారికి బ్యాంకులు గుడ్ న్యూస్ లు చెప్తుంటాయి. తాజాగా యూనియన్ బ్యాంకు కూడా సొంతిల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1020 చదరపు అడుగుల ఫ్లాట్ ని ఆక్షన్ లో పెట్టింది. సికింద్రాబాద్ లో ఉన్న ఒక ఫ్లాట్ ని 25 లక్షలకు వేలంపాటలో పెట్టింది. హోమ్ లోన్లు తీసుకుని ఎవరైనా సకాలంలో రుణాలు చెల్లించలేని పక్షంలో బ్యాంకులు ప్రాపర్టీల మీద వేలంపాటలు నిర్వహిస్తాయి. ఈ వేలంపాటలో ప్రాపర్టీ అసలు ధర మీద 30 శాతం వరకూ తగ్గింపు అనేది లభిస్తుంది. దీంతో తక్కువ ధరకే ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు.

తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సికింద్రాబాద్ లో ఓ ఫ్లాట్ ని ఆక్షన్ లో పెట్టింది. చదరపు అడుగుకి రూ. 2,450 చొప్పున రిజర్వ్ ప్రైజ్ ని నిర్ణయించింది. అంటే 1020 చదరపు అడుగులకు గాను రూ. 25 లక్షలు రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఇందులో 10 శాతం అంటే 2,50,000 రూపాయలు ఈఎండీగా బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది. వేలంపాటలో పాల్గొనేందుకు ఈ అమౌంట్ అనేది చెల్లించాలి. ఈఎండీ అమౌంట్ ని ఆగస్టు 28 బుధవారం మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లించాలి. వేలంపాట మరుసటి రోజు అనగా ఆగస్టు 29న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆక్షన్ 25 లక్షల నుంచి మొదలవుతుంది. ఆపైన ఎవరు ఎక్కువకి పాడుకుంటే ఫ్లాట్ వారి సొంతమవుతుంది.

Flat At 25 Lakhs In Secunderabad 1

అయితే వేలంపాటలో పాల్గొన్న రోజు నాడే ఆక్షన్ లో గెలిచినవారు ఫ్లాట్ ధరలో కొంత మొత్తాన్ని బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మీరు చెల్లించిన డబ్బుని వెనక్కి ఇచ్చేస్తుంది. అయితే వేలంపాటలో పాల్గొనే ముందు అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. అలానే అక్కడ ఫ్లాట్ ధర ఎంత ఉందో కూడా చూసుకోవాలి. దాన్ని బట్టే వేలంపాటలో అమౌంట్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. అదృష్టం కొద్దీ తక్కువ ధరకే వస్తే అంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది. సికింద్రాబాద్ ప్రాంతంలోని పలు ఏరియాల్లో ప్రస్తుతం 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ ధరలు కనీసం రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకూ ఉన్నాయి. మరి మీరు ఆక్షన్ లో ఫ్లాట్ సొంతం చేసుకోవాలంటే కనుక ఈ లింక్ పై క్లిక్ చేయండి.