ట్రాఫిక్ నియంత్రణకు CM రేవంత్ వినూత్న ఆలోచన.. రంగంలోకి ట్రాన్స్ జెండర్స్‌

CM Revanth Reddys Sensational Decision: ఇటీవల తెలంగాణలో వరుస ప్రమాదాలతో ప్రజలు రోడ్లపై రావాలంటే భయంతో వణికిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

CM Revanth Reddys Sensational Decision: ఇటీవల తెలంగాణలో వరుస ప్రమాదాలతో ప్రజలు రోడ్లపై రావాలంటే భయంతో వణికిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకులు కన్నుమూస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినతరం చేసినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినా ఎవరో ఒకరు తప్పులు చేస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి ఓ వినూత్న ఆలోచన చేశారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్స్ ను వాలంటీర్స్ గా ఉపయోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి అధికారులతో చర్చించినట్లు సమాచారం. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ఉన్నాతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హూం గార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పరిధి రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ది, పారిశుధ్యం, ఇతరు పనుల్లో పురోగతి పై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. టెండర్లు దక్కించుకున్న వారు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంట్రాక్టర్లను ఉపేక్షించే సమస్యలేదని.. ఇచ్చిన గడువులో పనులు పూర్తి చేయాల్సిందే అని స్పష్టం చేశారు. పనులు జాప్యం చేసేవారు.. ఇచ్చిన సమయానికి పూర్తి చేయని కాంట్రాక్టర్ల పూర్తి స్థాయి రిపోర్ట్ 15 రోజుల్లో అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తప్పుడు రిపోర్టులు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Show comments