iDreamPost
android-app
ios-app

Hyderabad: రేపు ఆగస్టు 15న ఈ రూట్లలో వెళ్ళకండి! పాస్ లు ఉన్న వారికే అనుమతి!

  • Published Aug 14, 2024 | 5:29 PM Updated Updated Aug 14, 2024 | 5:35 PM

Traffic Alert: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఆ రూట్లలో వెళ్లేవారు అలర్ట్​గా ఉండాలి. పాస్​లు లేనిదే ఆ ఏరియాల్లో అనుమతించరు.

Traffic Alert: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఆ రూట్లలో వెళ్లేవారు అలర్ట్​గా ఉండాలి. పాస్​లు లేనిదే ఆ ఏరియాల్లో అనుమతించరు.

  • Published Aug 14, 2024 | 5:29 PMUpdated Aug 14, 2024 | 5:35 PM
Hyderabad: రేపు ఆగస్టు 15న ఈ రూట్లలో వెళ్ళకండి! పాస్ లు ఉన్న వారికే అనుమతి!

ట్రాపిక్​ పోలీసులు పలు ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారనేది తెలిసిందే. నాలా, రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు, అలాగే పలు పండుగలు, పొలిటికల్ ర్యాలీలు, మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఇలాగే ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో హైదరాబాద్​లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోల్కొండలో జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్​కు వచ్చేవారు వెళ్లాల్సిన రూట్లు, పార్కింగ్ ఏరియాపై రూట్ మ్యాప్ రూపొందించారు సిటీ పోలీసులు. ఈ ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలిస్తే గోల్కొండ పరిసరాల్లో ప్రయాణించే వాళ్లు తక్కువ టైమ్​లో తాము వెళ్లాల్సిన స్థానాలకు చేరుకోవచ్చు.

హైదరాబాద్​లో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డును తాత్కాలికంగా పోలీసులు మూసివేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్‌, ఏ పింక్, బీ నీలం పాసులను అందజేశారు. ఆయా రూట్లలో పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. మాసబ్​ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి ఏ పింక్, గోల్డ్, ఏ నీలం పాసులు ఉన్నవారిని గోల్కొండ కోట వరకు అనుమతిస్తారు. ఏ గోల్డ్ పాసులు ఉన్నవారు వెహికిల్స్​ను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్​పై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేసుకోవాలి.

ఏ-పింక్ పాసులు ఉన్న వెహికిల్స్ కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్​స్టాప్ దగ్గర పార్క్ చేయాల్సి ఉంటుంది. బీ పాసులు ఉన్నవారు గోల్కొండ బస్​స్టాప్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫుట్​బాల్ గ్రౌండ్ దగ్గర వాహనాలను పార్కింగ్ చేయాలి. సీ గ్రీన్ పాసులు ఉన్న వాహనదారులు తమ వెహికిల్స్​ను కోట మెయిన్ ఎంట్రన్స్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న జీహెచ్​ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. డీ, ఎరుపు పాసులు ఉన్నవారు ప్రియదర్శిని స్కూల్​లో వెహికల్స్​ను పార్క్ చేసుకోవచ్చు. ఏ, బ్లాక్ పాసులు ఉన్న వాహనదారులు ఫతేదర్వాజ వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద వాహనాలను నిలపాలి. షేక్​పేట, టోలీచౌకీ నుంచి వచ్చేవారు వెహికిల్స్​ను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్ చేసుకోవచ్చు.