iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. పొరపాటున కూడా ఆ వైపు వెళ్లకండి

Hyderabad Rains: హైదరాబద్ నగరంలో వర్షం దంచికొట్టింది. భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. మీరు ఆయా ప్రాంతాలకు పొరపాటున కూడా వెళ్లకండి.

Hyderabad Rains: హైదరాబద్ నగరంలో వర్షం దంచికొట్టింది. భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. మీరు ఆయా ప్రాంతాలకు పొరపాటున కూడా వెళ్లకండి.

హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. పొరపాటున కూడా ఆ వైపు వెళ్లకండి

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతున్నది. జోరు వానలతో నగరం హోరెత్తుతున్నది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక తాజాగా హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకు వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని పట్ట పగలే చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆయాప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరి మీరు ఆయా ప్రాంతాల వైపు వెళ్లారంటే చిక్కుల్లో పడతారు. పొరపాటున కూడా అటు వైపు వెళ్లకండి.

ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు:

షేక్ పేట్ ఫ్లైఓవర్ వద్ద భారీగా నీరు నిలవడంతో మోటరిస్టులు అటు వైపు వెళ్ల వద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. గచ్చిబౌలి, నార్సింగి, లంగర్ హౌస్, మెహిదీపట్నం ఏరియాల్లో ప్రయాణించే వారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మైత్రీ వనం, ఎస్ ఆర్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. ఇక పారడైస్, సీటీసీ, రసూల్ పుర, బేగం పేట్, ప్రకాశ్ నగర్ ఏరియాల్లో భారీగా వర్షం కురియడంతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దీంతో వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. భారీ వర్షం కురిసిన ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

నగరంలో భారీ వర్షం కారణంగా పీటీఐ, మహవీర్, మాసబ్ ట్యాంక్, ఆసిఫ్ నగర్, బసవతారకం హాస్పిటల్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ చెక్ పోస్టు, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ హెవీగా ఉంది. ఈ రోజు రాఖీ పండగ కావడంతో వేలాది వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. తమ బంధువుల వద్దకు వెళ్లేవారితో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. నగరంలో ఇంకా ఆకాశం మేఘావృతమై.. వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ప్రజలు, వాహనదారులు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.