iDreamPost
android-app
ios-app

ఇంట్లోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణ హత్య.. అసలేం జరిగింది?

  • Published Oct 01, 2024 | 11:20 AM Updated Updated Oct 01, 2024 | 11:20 AM

Miyapur Crime News: ఇటీవల మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు ఒంటరిగా ఉంటున్న మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య తీవ్ర కలకలం రేపింది.

Miyapur Crime News: ఇటీవల మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు ఒంటరిగా ఉంటున్న మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య తీవ్ర కలకలం రేపింది.

  • Published Oct 01, 2024 | 11:20 AMUpdated Oct 01, 2024 | 11:20 AM
ఇంట్లోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణ హత్య.. అసలేం జరిగింది?

ఈ మధ్య కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. ఇక డబ్బు కోసం ఎన్ని దారుణాలకైనా తెగబడే నర హంతకులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. మియాపూర్ లో ఓ మహిళా టెక్కీ దుండగులు అత్యంత దారుణంగా పొడిచి చంపారు.. అది కూడా ఆమె ఇంట్లోనే. ఆ హత్య వెనుక ఎవరు ఉన్నారు.. ఆమెను ఎవరు చంపారు? డబ్బు కోసమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయం గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్ మియాపూర్‌లో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆమె ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘలన తీవ్ర భయాందోళన సృష్టిచింది. ఏసీపీ నరసింహారావు, సీఐ దుర్గారామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దీప్తి నగర్ సీబీఆర్ ఎస్టేట్ 3 ఏ బ్లాక్ లో ఉంటున్న ప్రైవేట్ స్కూల్ టీచర్ నమ్రుత కూతురు బండి స్పందన (29). కొంత కాలంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. స్పందన ఇంటర్ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది ఆగస్టులో పెళ్లైంది. వినయ్ కుమార్ ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు.

పెళ్లై కొద్దిరోజులకే స్పందన, వినయ్ మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దలు సర్ధి చెప్పినా వారు వినిపించుకోకుండా ఒకరిపై ఒక దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే 2023 లో భర్త వినయ్ తనను వేధించడం, కొట్టడం లాంటివి చేస్తున్నాడని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో స్పందన ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకుందామని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ క్రమంలోనే సోమవారం తల్లి నమ్రుత స్కూల్ కి వెళ్లగా స్పందన ఇంట్లో ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం స్పందన ఇంటికి ఆమె సోదరి వెళ్లింది.. ఎంతగా తలపులు తట్టి లోపలి నుంచి  రిప్లై రాలేదు. దీంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. తర్వాత తల్లి నమ్రుత వచ్చి కాలింగ్ బెల్ నొక్కినా, తలుపులు తట్టినా, స్పందన సెల్ కి కాల్ చేసినా ఎలాంటి రిప్లై రాలేదు.

అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రక్తపు మడుగులో స్పందన బెడ్ పై విగతజీవిగా పడి ఉంది. ఆమెను హంతకులు విచక్షణారహితంగా పొడిచి చంపారు. వెంటనే స్పందన తల్లి పోలీసులకు సమాచారం అందించింది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు అక్కడ ఎటువంటి ఆయుధం లభించలేదని తెలిపారు. తల్లి నమ్రుత ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ని సేకరించి పరిశీలిస్తున్నారు. దుండగులు సుపారీ తీసుకొని హత్య చేశారా? హత్య వెనుక భర్త హస్తం ఏమైనా ఉందా? వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis