iDreamPost
android-app
ios-app

ఈమె ఒక బ్యూటీషియన్.. ఓ యువకుడితో పరిచయం ఏర్పడి..

  • Published Aug 29, 2024 | 1:43 PM Updated Updated Aug 29, 2024 | 1:43 PM

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడుతున్నారు.. వారి ప్రేమను కాదంటే దారుణంగా హతమార్చుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడుతున్నారు.. వారి ప్రేమను కాదంటే దారుణంగా హతమార్చుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

  • Published Aug 29, 2024 | 1:43 PMUpdated Aug 29, 2024 | 1:43 PM
ఈమె ఒక బ్యూటీషియన్.. ఓ యువకుడితో పరిచయం ఏర్పడి..

ఇటీవల ఆడవాళ్లపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. లైంగిక వేధింపులు,అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కోల్‌కొతాలో ఓ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువుతుతున్నప్పటికీ మరికొన్ని ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొంతమంది ప్రేమోన్మాదులు తమ ప్రేమను అంగీకరించలేదన్న యువతులపై దాడులకు తెగబడటం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ దారుణ సంఘటన వెలుగు చూసింది. ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం వచ్చిన యువతి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో బ్యుటీషియన్ గా పనిచేస్తున్న ఓ యువతి మృతి చెందింది. పశ్చిమ బెంగాల్ కి చెందిన దీపన తమాంగ్ అనే యువతి నల్గండ్లలోని ఓ బ్యూటీపార్లర్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. కర్ణాటకకు చెందిన రాకేష్ అనే యువకుడితో దీపనకు పరిచయం ఏర్పడింది. కొంత కాలం వీరుడు సన్నిహితంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని రాకేష్.. దీపనతో చెప్పాడు. కానీ ఇంకా సెటిల్ కాలేదు.. ఇప్పుడప్పుడే పెళ్లి వొద్దని చెప్పింది దీపన. చాలా రోజుల నుంచి పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు రాకేష్.. ససేమిరా అంటూ వచ్చింది దీపన.

తన మాట కాదన్న కోపంతో రగిలిపోయాడు రాకేష్. బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి పెద్ద గొడవ చేశాడు. అంతేకాదు తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో రాకేష్ ని అడ్డుకోవడానికి వెళ్లిన దీపన తమాంగ్ స్నేహితులపై కూడా దాడి చేశాడు. గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య అనంతరం రాకేష్ మెయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స నిమితరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş