P Krishna
Telangana SC Corporation Free Driving Training: దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. చదువుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది.. ఉద్యోగాల సంఖ్య తగ్గి పోతుంది. చిన్న ఉద్యోగం అయినా సరే వందల మంది పోటీలో ఉంటున్నారు. అలాంటి వారి కోసం తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.
Telangana SC Corporation Free Driving Training: దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. చదువుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది.. ఉద్యోగాల సంఖ్య తగ్గి పోతుంది. చిన్న ఉద్యోగం అయినా సరే వందల మంది పోటీలో ఉంటున్నారు. అలాంటి వారి కోసం తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.
P Krishna
దేశంలో రోజు రోజుకీ జనాభా పెరిగిపోతుంది.. దీనికి తోడు నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోతుంది. చిన్న ఉద్యోగం అయినా సరే వందల సంఖ్యల్లో పోటీ ఉంటుంది. మరికొన్ని చోట్ల లంచావతారులు ఉద్యోగాలు బేరసారాలు ఆడుతూ అర్హత లేని వారికి చుట్టబెడుతున్నారు. టెన్త్ నుంచి పోస్ట్ – గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత ఉన్న నిరుద్యోగులు తమకు తగ్గ జాబ్ వస్తేనే చేస్తామన్న దోరణిలో ఉంటున్నారు. ఎన్నేళ్లైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే టార్గెట్ గా పెట్టుకొని నిరుద్యోగులుగా ఉంటున్నవారు కూడా దేశంలో ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఉద్యోగం లేని వారికి ఆసరాగా ఉండేందుకు తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ ముందుకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో నిరుద్యోగ సమస్య తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ, యువకులు, ట్రాన్స్ జెండర్ కి ఉచిత డ్రైవింగ్ (లైట్, హెవీ మోటార్ వెహికిల్) శిక్షణ అందించబోతున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 20లోపు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో దరఖాస్తు సమర్పించాలని ఎస్సీ కార్పోరేషన్ ఈడీ బాలాజీ తెలిపారు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్‌కు అర్హతకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు, 8వ తరగతి పాస్ అయి ఉండాలని తెలిపారు. హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్‌కు 20 నుంచి 35 ఏళ్ల వయసు, టెన్త్ పాస్ అయి ఉండాలి. ట్రాన్స్ జెండర్లు సైతం ఈ అవకాశం వినియోగించుకోవాలని.. మేడ్చన్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. హకీంపేట్ డ్రైవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఉచిత భోజనంతోపాటు వసతి సదుపాయం కూడా కల్పించనున్నారు.
సాధారణంగా కొంతమంది నిరుద్యోగ యువత డ్రైవింగ్ అంటే ఒకరకమైన చిన్న చూపు ఉంటుంది. కానీ.. నేటి బిజీ లైఫ్‌లో ప్రయాణాలు క్షణాల్లో జరిగిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఊబర్, ఓలా, ర్యాపిడ్ వంటి వాహన సదుపాయాలు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నమోషీ అనుకోకుండా స్వతంత్రంగా బతకాలని అనుకునే వారు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటూ లైఫ్ లో సెటిల్ కావొచ్చు అంటున్నారు అధికారులు. నిరుద్యోగులకు డ్రైవింగ్ అర్హత, లైసెన్స్ ఉంటే ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తున్నాయని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం నిరుద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకుంటు బెటర్.