iDreamPost
android-app
ios-app

వారికి CM రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే చర్యలు తప్పవు!

  • Published Aug 29, 2024 | 4:15 PM Updated Updated Aug 29, 2024 | 4:15 PM

CM Revanth Reddy Warning: తెలంగాణలో ఎక్కడ చూడు ‘హైడ్రా’ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్-కన్వేన్షన్ సెంటర్‌ని కూల్చి వేసిన తర్వాత ‘హైడ్రా’ పేరు బాగా వినిపిస్తుంది. నగరంలో అక్రమ కట్టడాలు చేపట్టిన వారు హైడ్రా పేరు చెబితే హడలెత్తిపోతున్నారు.

CM Revanth Reddy Warning: తెలంగాణలో ఎక్కడ చూడు ‘హైడ్రా’ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్-కన్వేన్షన్ సెంటర్‌ని కూల్చి వేసిన తర్వాత ‘హైడ్రా’ పేరు బాగా వినిపిస్తుంది. నగరంలో అక్రమ కట్టడాలు చేపట్టిన వారు హైడ్రా పేరు చెబితే హడలెత్తిపోతున్నారు.

వారికి CM రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే చర్యలు తప్పవు!

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు పూర్తిగా నేల మట్టం చేసి భవిష్యత్ లో వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టడానికి ‘హైడ్రా’ను ఏర్పాటు చేసినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని  అవాంతరాలు,  అడ్డంకాలు ఎదురైనా.. ఎంతమంది బెదిరించినా ‘హైడ్రా’ తన పని చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. తన సొంత కుటుంబ సభ్యులైనా అక్రమా కట్టడాలు చేపట్టారని తెలిస్తే వెంటనే కూల్చివేతలు చేపడతామని అన్నారు రేవంత్ రెడ్డి. నగరంలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎవరినీ వదలిపెట్టకుండా అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు నోటీసులు ఇచ్చి కూల్చి వేస్తున్నారు.  ఒక రకంగా కొంతమందికి హైడ్రా పేరు చెబితే భయపడే పరిస్థితి.  తాజాగా  సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

నగరంలో అక్రమ కట్టడాలను తొలగించి క్లీన్ సిటీగా మార్చాలన్న సదుద్దేశంతో ‘హైడ్రా’ను ఏర్పాటు చేశామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హైడ్రా పేరుతో అక్రమాలకు పాల్పపడుతున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  గురువారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘హైడ్రా పనితీరు మెచ్చుకుంటు ప్రజల నుంచి ఎంతో గొప్ప రెస్పాన్స్ వస్తుంది. కానీ.. ఎక్కడ మంచి చేయాలని చూస్తామో.. అక్కడ అక్రమార్కులు అడ్డు తగులుతూనే ఉంటారు. హైడ్రా పేరు చెప్పుకొని కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. అలాంటి వారిపేర్లు బయటికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

CM Revanth Reddy warning them

‘అలాగే  హైడ్రా పేరు చెప్పి కొంతమంది మున్సిపల్, రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పపడుతున్నట్టు తెలిసింది. అలాంటి వారి పేర్లు నా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటా. అమాయకులను భయపెడితే ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడుతుంది, వారి వద్ద డబ్బులు వసూళ్లు చేస్తే ఊరుకునే సమస్యే లేదు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్ కు ఆదేశాలు జారీ చేశాం’ అని అన్నారు.