iDreamPost
android-app
ios-app

Hyderabad: హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలు.. తెలంగాణ హైకోర్టు మరో కీలక తీర్పు!

Hyderabad News: ప్రతి ఏటా హైదరాబాద్ లో జరిగే వినాయక చవితి వేడుకల్లో హుస్సేన్ సాగర్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. కారణం.. నగరంలోని గణేష్ విగ్రహాలన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారు. అయితే నిన్న తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. తాజాగా మరో కీలక తీర్పు ఇచ్చింది.

Hyderabad News: ప్రతి ఏటా హైదరాబాద్ లో జరిగే వినాయక చవితి వేడుకల్లో హుస్సేన్ సాగర్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. కారణం.. నగరంలోని గణేష్ విగ్రహాలన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారు. అయితే నిన్న తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. తాజాగా మరో కీలక తీర్పు ఇచ్చింది.

Hyderabad: హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలు.. తెలంగాణ హైకోర్టు మరో కీలక తీర్పు!

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియా.. మంగళ మూర్తీ మోరియా అనే కీర్తనలు వినిపిస్తున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా మండపాలు అందంగా అలంకరించి అందులో గణపతి మూర్తిని ప్రతిష్టించారు. నవరాత్రులు భక్తులు ఎంతో నిష్టగా పూజలు చేసి.. ఆ తరువాత గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయకుల నిమజ్జనం చేయవొద్దని ఈ నెల 3న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కనుక ప్రతివాదిగా దానిని కూడా చేర్చాలని పిటీషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి కోర్టుపై ఒత్తిడి పెంచడం సరైనది కాదని పిటిషనర్లకు సూచించింది. అయితే గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నందున వాటిని పరిశీలిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిపిన హై కోర్టు.. తదుపరి విచారణ మంగళవారం అనగా సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వినాయక నిమజ్జనాలు హుసేస్ సాగర్ లో ఉంటాయా? లేదా? అందరు సందేహాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దంటూ చివరి నిమిషంలో పిటిషన్ వేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది.  కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపకపోవడంతో ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.  2021లో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.  ఇదే సమయంలో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సైతం కోర్టు తిరస్కరించింది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ట్యాంక్ బండ్ పై గణేశ్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. మరి.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.