iDreamPost
android-app
ios-app

వర్షం పడుతుందని ఆగడమే తను చేసిన తప్పు.. ఇలా జరుగుతుందని ఊహించలేదు!

  • Published Aug 20, 2024 | 3:19 PM Updated Updated Aug 20, 2024 | 3:19 PM

Hyderabad City: హైదరాబాద్ లో తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది..దీంతో జనజీవనం స్థంభించిపోయింది. ఎటు చూసినా వరదనీరు ప్రవహించింది.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి.

Hyderabad City: హైదరాబాద్ లో తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది..దీంతో జనజీవనం స్థంభించిపోయింది. ఎటు చూసినా వరదనీరు ప్రవహించింది.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి.

వర్షం పడుతుందని ఆగడమే తను చేసిన తప్పు.. ఇలా జరుగుతుందని ఊహించలేదు!

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం నుంచి హైదరాబాద్ లో వాతావరణంలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టి.. సాయంత్రానికి అనూహ్యంగా మబ్బులు పట్టి భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున దాదాపు మూడు గంటల పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షాలు కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం పడుతుందని ఫ్లై ఓవర్ కింద నిల్చుంది.. అంతలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో ఈరోజు ఉదయం ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే  రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. సనత్ నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం వర్షంలో కొట్టుకొని పోయి పార్శీ గుట్ట దగ్గర తేలింది. ఆ వ్యక్తి పార్శీగుట్టకు చెందిన అనీల్ గా గుర్తించారు పోలీసులు.  వర్షాకాలం ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అందుకే బయటకు రావొద్దని అధికారుల చెబుతుంటారు. ఓ యువతి ఫ్లై ఓవర్ కింద నిలబడి ఉండగా.. స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో యువతి చావుబతుకుల మధ్య పోరాడుతుంది.

హైదరాబాద్ సిటీ రాజేంద్ర నగర్ కి చెందిన హారిక అనే యువతి ఆఫీస్‌కి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. వర్షం పడుతుంది.. తాను తడవ కుండా ఉండాలని అత్తాపూర్‌లో పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 130 కింద నిల్చుని బస్ కోసం వెయిట్ చేస్తుంది. అంతలోనే ఓ స్కూల్ బస్సు అటుగా వచ్చి హారిక ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హారిక కొద్ది దూరం ఎగిరి పడి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. హారిక ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే వర్షాల కారణంగా ప్రమాదాలు పొంచి ఉంటాయి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితులైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.