SNP
Richmond Villas, Bandlaguda, Ganesh Laddu: ఒక కోటీ 87 లక్షలకు గణేష్ లడ్డూ వేలం పాటతో రిచ్‌మండ్ విల్లాస్ వార్తల్లో నిలిచింది. నిజానికి అది వేలం పాటు కాదు.. దాని వెనుక ఉన్న ట్వీస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Richmond Villas, Bandlaguda, Ganesh Laddu: ఒక కోటీ 87 లక్షలకు గణేష్ లడ్డూ వేలం పాటతో రిచ్‌మండ్ విల్లాస్ వార్తల్లో నిలిచింది. నిజానికి అది వేలం పాటు కాదు.. దాని వెనుక ఉన్న ట్వీస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రతిఏడాది లాగే ఈ సారి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ మహా నగరంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. చవితి రోజు విగ్రహ ప్రతిష్ట, ఆ తర్వాత పూజలు, అన్నదానాలతో గణేష్ మండపాలు కళకళలాడాయి. బుధవారం నిమజ్జనంతో గణపతి పండుగ ముగిసింది. అంతకంటే ముందు.. అందరిలో ఆసక్తి కలిగించే లడ్డూ వేలం పాటలు కూడా హోరాహోరీగా జరిగాయి. బండ్లగూడ జాగీర్ దగ్గర ఉన్న కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లోని వినాయక మండపంలో గణపతి లడ్డూ ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయలు పలికింది. ఇంత భారీ ధర పలకడంతో.. రిచ్‌మండ్ విల్లాస్ వినాయకుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
వామ్మో.. లడ్డూనే ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయలు పెట్టి కొన్నారంటే.. ఎవరో అంబానీకి చుట్టం అయి ఉంటారని అంతా సరదాగా మాట్లాడుకున్నారు. కానీ, ఈ వేలం పాట.. మనం చూసే వేలం పాట లాగా కాదు. సాధారణంగా వీధుల్లో పెట్టే వినాయకుడి మండపాల్లో లడ్డూ వేలం పాట పెడితే.. భక్తులు వేలంలో పాల్గొని.. ధర పెంచుకుంటూ పోతుంటారు. ఫైనల్‌గా ఎవరూ పోటీకి రాకుంటే.. అత్యధిక ధర చెప్పిన వ్యక్తిని విజేతగా ప్రకటించి.. ఆయన నుంచి వేలంలో పాడిన డబ్బును తీసుకొని.. లడ్డూను అందజేస్తారు. కానీ, రిచ్‌మండ్ విల్లాస్‌లో అలా కాదు.
ఇక్కడి లడ్డూ వేలం అసలు కథ వేరేలా ఉంటుంది. ఈ లడ్డూ వేలం పాటలో ఒక వ్యక్తి పాల్గొనరు. మొత్తం 150 మంది నాలుగు గ్రూపులుగా డివైడ్ అయి.. లడ్డూ కోసం బిడ్ వేస్తారు. ఉదాహరణకు ఒక గ్రూపు వారు 30 లక్షలు, మరో గ్రూపు 26 లక్షలు, ఇంకో గ్రూపు 35 లక్షలు, చివరి గ్రూప్ వారు 50 లక్షలకు బిడ్ వేస్తారు. అత్యధిక బిడ్ వేసిన వారికి లడ్డూ ఇస్తారేమో అని అనుకునేరు.. అలా కూడా కాదు. ఈ ట్విస్ట్ తెలిస్తే.. ఇది అసలు వేలం పాట ఎలా అవుతుంది అని అనుకుంటారు. బిడ్ వేసిన నాలుగు గ్రూపుల వారు కూడా డబ్బు కట్టాల్సిందే. అలా అని అత్యధిక బిడ్ వేసిన గ్రూపుకు కూడా లడ్డూ ఇవ్వరు. అన్ని గ్రూపుల వారికి లడ్డూ పంచుతారు. ఇలా వేలంలో పాల్గొన్న ప్రతి గ్రూప్ వారు.. తాము ఎంతైతే బిడ్ వేశామో అంత మొత్తం చెల్లించాల్సిందే.
సింపుల్‌గా చెప్పాలంటే.. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అందరూ కలిసి.. డబ్బులు పొగేసుకొని.. ఆ డబ్బును లడ్డూ కోసం ఇస్తున్నారు. ఇది వేలం పాట కాదు. కానీ, వాళ్లు చేసే ఈ పని వెనుక మాత్రం చాలా మంచి ఉద్దేశం ఉంది. లడ్డూ కోసం వచ్చిన డబ్బును కమిటీ వాళ్లు పేదలకు సాయం చేయడానికి మాత్రమే వాడుతుంటారు. ఆర్‌వీ దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. లడ్డూ వేలం పాట డబ్బులు ట్రస్ట్ వారికి ఇస్తారు. ట్రస్ట్ వాలంటీర్లు హైదరాబాద్‌తో పాటు మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు ఈ డబ్బును వినియోగిస్తారు. అయితే.. ఎవరికీ నగదు రూపంలో సాయం చేయరు. నెలవారీ సరుకులు, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడం, ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి వేలం పాట రూల్స్‌ను బ్రేక్ చేసి.. ఒక మంచి కాజ్ కోసం ఇంత డబ్బును లడ్డూ కోసం కేటాయిస్తూ.. దాన్ని పేదల కోసం ఉపయోగిస్తున్న ఈ రిచ్‌మండ్ విల్లాస్ వాసులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The #Ganesh laddu at Richmond Villas in #BandlagudaJagir, shocked everyone by getting an incredible amount of Rs 1.87 crore at an auction, creating a new record.
This astounding amount far outshone the auction price of around Rs 1.25 crore for the same laddu from… pic.twitter.com/5CHdMQaUQ5
— NewsMeter (@NewsMeter_In) September 17, 2024