బయటకు మాత్రం కిరాణాషాపు.. లోపల యవ్వారం చూస్తే షాక్ తింటారు!

బయటకు మాత్రం కిరాణాషాపు.. లోపల యవ్వారం చూస్తే షాక్ తింటారు!

Cannabis Chocolates: ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ దందా బాగా పెరిగిపోయింది. డబ్బు సంపాదన కోసం కొంతమంది కేటుగాళ్లు విద్యార్థులకు సైతం చాక్లెట్ల రూపంలో గంజాయి అలవాటు చేస్తున్నారు.

Cannabis Chocolates: ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ దందా బాగా పెరిగిపోయింది. డబ్బు సంపాదన కోసం కొంతమంది కేటుగాళ్లు విద్యార్థులకు సైతం చాక్లెట్ల రూపంలో గంజాయి అలవాటు చేస్తున్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవితం గడపాలని చాలా మంది అక్రమాలు, మోసాలకు తెగబడుతున్నారు. ఎదుటి వారికి మాయ మాటలు చెప్పి దారుణంగా వంచిస్తున్నారు. అవతలివాళ్లు ఏమైనా పరవాలేదు.. నాకు మాత్రం డబ్బు వస్తే చాలు అన్న నీచమైన ఆలోచనలతో ఉంటున్నారు. ఇందుకోసం చిట్టీ వ్యాపారం, పెట్టిన పెట్టుబడికి రెండుమూడింతలు రాబడి అంటూ స్కీములు, గంజాయి, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కొంతమంది కేటుగాళ్ళు బయటకు కిరాణా షాపులు.. లోపల గలీజ్ దందాలు చేస్తున్నారు. ఓ కిరాణ షాపుపై రైడ్ చేసిన పోలీసులు షాపు యజమాని చేసిన పనిచూసి షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో కొంతమంది కేటుగాళ్ళు పెద్ద పెద్ద నగరాల్లో ఈజీగా డబ్బు సంపాదించేందుకు రక రకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. అందులో ఒకటి గంజాయి, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు.  బడాబాబులు, యువతను టార్గెట్ చేసుకొని చేస్తున్న ఈ దందాలో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా కాలేజ్, పబ్స్, పార్కులు ఇలా కొన్ని ప్రదేశాలను ఎంచుకొని స్మగ్లర్లు యదేచ్చగా తమ దందా కొనసాగిస్తున్నారు. మరికొంతమంది కిరాణ షాపులు, టీ స్టాల్స్, బడ్డీ కొట్లు, పాన్ షాపులు కేంద్రాలుగా చేసుకొని గంజాయి దందా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఇలాంటి దందాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా దొంగచాటుగా వ్యవహారాలు నడుపుతున్నారు.

మేడ్చల్ లో కిరాణా షాపు ముసుగులో గంజాయి దందా చేస్తున్న ఓ కేటుగాడి గుట్టు రట్టు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. సుభాష్ నగర్ లోని ఓ కిరాణాషాపులో గంజాయి చాక్ లెట్స్ అమ్ముతూ చుట్టు పక్కల యువతతో పాటు చిన్న పిల్లలను కూడా బానిసలుగా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.ఈ క్రమంలోనే పేట్ బషీర్ బాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 5 ప్యాకెట్ల లో 200 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా షాపు యజమాని ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న పెడ్లర్ వివేష్ పాండేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇతను ఉత్తర్ ప్రదేశ్ కి చెందినవాడని.. యూపీలోని ప్రయాగ్ రాజ్ నుంచి చాక్లెట్లు తెచ్చి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Show comments