iDreamPost
android-app
ios-app

ఇళ్లకు హైడ్రా మార్కింగ్.. అధికారులను తరిమిన జనం…!

  • Published Sep 26, 2024 | 1:32 PM Updated Updated Sep 26, 2024 | 1:32 PM

Hydra Focus Illegal Constructions Musi: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా పేరు వినిపిస్తుంది.చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మాణలు చేపట్టిన వాటిని వరుసగా కూల్చి వేస్తున్నారు హైడ్రా అధికారులు.

Hydra Focus Illegal Constructions Musi: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా పేరు వినిపిస్తుంది.చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మాణలు చేపట్టిన వాటిని వరుసగా కూల్చి వేస్తున్నారు హైడ్రా అధికారులు.

ఇళ్లకు హైడ్రా మార్కింగ్.. అధికారులను తరిమిన జనం…!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ని నియమించారు. చెరువుల్లోని బఫర్, ఎఫ్‌టీఎల్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నారు. ఎంతోమంది రియల్టర్లు, బిల్డర్లు చెరువులను, ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని మధ్యతరగతి వారికి విక్రయించారు. తాజాగా మూసీ పరిసరాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో గత కొన్నిరోజులుగా అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, పొలిటీషియన్స్, వ్యాపార వేత్తలు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు సర్వేలో తెలితే వెంటనే కూల్చి వేత మొదలు పెడుతున్నారు హైడ్రా అధికారులు. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వినిపిస్తున్నా, కోర్టులో కేసులు వేసినా.. అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు ఆపే ప్రసక్తి లేదని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా హైబారాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది.చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, కొత్తపేట, మారుతీనగర్, సత్యానగర్, చైతన్య పురి, ఫణిగిరి కాలనీ, ఇందిరా నగర్ , గణేష్ పురి లో సర్వే కోసం వెళ్లిన అధికారులను చేదు అనుభవం ఎదురైంది. తమ ఇండ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని అధికారులను స్థానికులు తరిమివేశారు. 30 ఏళ్ల నుంచి వెంచర్లు వేస్తుంటే అధికారులు ఏం చేశారు? అని స్థానికులు ప్రశ్నించారు. దీంతో సర్వే నిర్వహించకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు హైడ్రా అధికారులు. కొన్ని ఇళ్లకు మాత్రంమార్కులు వేసినట్లు తెలుస్తుంది.

మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13వేల ఆక్రమణలను ప్రభుత్వం గురించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తుంది. ఒక్కో టీమ్ లో ఎమ్మార్వోతో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొంతమంది నిర్వాసితులు మాట్లాడుతూ.. మాకు డబుల్ బెడ్ రూమ్ లు వద్దు.. రూపాయి రూపాయి పొగు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ ఉన్నవాళ్లమంతా లేబర్లే.. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదని నిర్వాసితులు అంటున్నారు.డబుల్ బెడ్ రూమ్ అంటున్నారు.. ఉన్నవాళ్లకే ఇస్తున్నారు. మేం ఎలా బతకాలి? ప్రాణాలైనా ఇస్తాం.. హైడ్రా బుల్డోజర్లను రానివ్వం అంటున్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు బాధితులు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది.