P Krishna
Hyderabad Viral News: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా జర్నీ చేసే సదుపాయం కల్పించబడింది.
Hyderabad Viral News: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా జర్నీ చేసే సదుపాయం కల్పించబడింది.
P Krishna
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ‘ఆరు గ్యారెంటీ పథకాలు’ పై తొలి సంతకం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ఇటీవల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసినప్పటి నుంచి ఆర్టీసికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఓ మహిళ చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు, చిరు వ్యాపారులు, విద్యార్థులకు, గృహిణులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. అప్పుడప్పుడు బస్సుల్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు బస్సు ఆపడం లేదని ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నల్లకుంట విద్యానగర్ లో విస్తుతపోయే ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఆపమని అడిగినా ఆపకపోవడంతో ఓ వృద్దురాలు ఆగ్రహంతో బస్సు డ్రైవర్ పై పాము విసిరింది.
నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద ఓ వృద్దురాలు ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసింది. డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు.. ఆగ్రహంతో తన వద్ద ఉన్న బాటిల్ తో బస్సుపై దాడి చేసింది. దీంతో వెనుక భాగంలోని అద్దం పగిలింది. అది గమనించిన డ్రైవర్ బస్సు పక్కకు ఆపి ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతే ఒక్కసారే సీన్ రివర్స్ అయ్యింది.. ఆ వృద్దురాలు తన వద్ద ఉన్న బ్యాగ్ నుంచి ఓ పాము తీసి డ్రైవర్ పై విసిరింది. దీంతో ఒక్కసారే షాక్ కి గురైన డ్రైవర్ పరుగెత్తాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు రంగంలోకి దిగి ఆమెను పట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే డ్రైవర్ పై పాము విసిరిన వృద్దురాలి బ్యాగ్ లో మరో రెండు పాములు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.