P Venkatesh
Hyderabad new traffic rules: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇకపై వాహనం ఇలా నడిపారో 2 వేల జరిమానా కట్టాల్సిందే. హెల్మెట్ లేకపోతే ఎంత అంటే?
Hyderabad new traffic rules: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇకపై వాహనం ఇలా నడిపారో 2 వేల జరిమానా కట్టాల్సిందే. హెల్మెట్ లేకపోతే ఎంత అంటే?
P Venkatesh
గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ కు లక్షలాది మంది వలస వస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. దీంతో నగరంలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. రోడ్లపైకి వేలాది వాహనాలు వస్తుండడంతో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు, అలాగే ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు సూచిస్తున్నప్పటికీ.. రూల్స్ అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. హెల్మెట్ లేకుండా, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
దీనికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఇకపై వాహనదారులు ఇలా బండి నడిపారో రూ. 2 వేలు కట్టాల్సిందే. హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కొంతమంది వాహనదారులు అర్జెంట్ వర్క్ ఉందనో, యూటర్న్ లాంగ్ ఉందనో, లేక ఇక్కడే కదా అని రాంగ్ రూట్ లో ప్రయాణిస్తుంటారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇలాంటి తప్పిదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు రెడీ అయ్యారు.
వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా, రాంగ్ రూట్ లో వెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200లకు వాహన జరిమానాను పెంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి మీరు ట్రాఫిక్ రూల్స్ ను లైట్ తీసుకుంటే మీ జేబుకు చిల్లు పడ్డట్టే. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయమయ్యే ప్రమాదాన్ని 70 శాతం, మరణాల ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తుందని అడిషినల్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఎడ్యుకేషన్, అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నారని విశ్వప్రసాద్ తెలిపారు. మరి మీరు సేఫ్ గా ఉండి తోటి ప్రయాణికులను సేఫ్ గా ఉండేలా చేయాలంటే కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అలాగే రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారుల నుంచే మార్పు ప్రారంభం కావాలి. హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.