Nagababu: హైడ్రాకు మద్దతుగా నాగబాబు వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ పై ప్రశంసలు

Nagababu Supports HYDRA: ఆక్రమార్కుల పాలిట సింహ స్వప్నంగా మారిన హైడ్రాపై నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Nagababu Supports HYDRA: ఆక్రమార్కుల పాలిట సింహ స్వప్నంగా మారిన హైడ్రాపై నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జాపై కొరడా ఝుళింపించేందకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. తొలి రోజు నుంచే అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారింది హైడ్రా. పేదలు, ధనికులు, సామన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు.. అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు.. నోటీసులు ఇచ్చిన రోజుల వ్యవధిలోనే కూల్చి వేతలు చేపడతూ.. హడల్ పుట్టిస్తుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇవ్వడం వంటివి చూస్తే.. హైడ్రా పని తీరు ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమార్కులు హైడ్రా చర్యలపై భయపడుతుండగా.. సామాన్యులు మాత్రం హర్షం వ్యక్తం చేయడమే కాక.. మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో  హీరో నాగబాబు.. హైడ్రా పని తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై స్పందిస్తూనే.. హైడ్రాకు మద్దతిస్తూ.. ట్వీట్ చేశారు నాగబాబు.  భారీ వర్షాల కారణంగా తూములు తెగిపోయి.. చెరువులు, నాళాలు ఉప్పొంగటంతో నగరంలో అపార్ట్‌మెంట్లలోకి సైతం నీళ్లు రావడం.. సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.  చెరువులు, నాళాలను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడమే ఈ విపత్తుకు ముఖ్య కారణం అని చెప్పుకొచ్చారు.

అంతేకాక ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన ‘హైడ్రా’కు నాగబాబు మద్దతిచ్చారు. ఈ విషయంలో ఎంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన పని తీరు కనబరుస్తోన్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసిద్దామని నాగబాబు ట్వీట్ చేశారు. ‘మేమంతా మీ వెనుకే ఉన్నాం, మీకు పూర్తి మద్దతునిస్తున్నాం’ అని నాగబాబు స్పష్టం చేశారు.

పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్న నాగబాబు.. అదే పర్యావరణాన్ని మనం నాశనం చేస్తే.. అది కచ్చితంగా మనల్ని శిక్షిస్తుందన్నారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సెలబ్రిటీలు మాత్రమే కాక.. సామాన్యులు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సైతం హైడ్రాకు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

Show comments