Swetha
ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు బర్నింగ్ టాపిక్ .. ఇప్పటికే బఫర్ జోన్ లోకి వచ్చిన భవనాలను నేలమట్టం చేశాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ పాతబస్తీ కూల్చివేతలకు సంబంధించి చాలానే చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు అక్కడ కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు బర్నింగ్ టాపిక్ .. ఇప్పటికే బఫర్ జోన్ లోకి వచ్చిన భవనాలను నేలమట్టం చేశాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ పాతబస్తీ కూల్చివేతలకు సంబంధించి చాలానే చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు అక్కడ కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి.
Swetha
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా హైడ్రా పేరు మోత మోగిపోయింది. ఇక గత వారం హైడ్రా మూసి పరివాహక ప్రాంతాలను టార్గెట్ చేసిందని.. అక్కడి ప్రజలు అడ్డుకోవడంతో హైడ్రా బుల్డోజర్లకు బ్రేకులు పడ్డాయనే వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాము. అయితే దానికి సంబంధించి నిన్న హైడ్రా ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎక్కడ కూల్చివేతలు జరుగుతున్నా హైడ్రా నే అంటున్నారని.. మూసి నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని.. అలాగే మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. అక్కడ కూల్చివేతలను మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది. ప్రస్తుతం పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. అక్కడ కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి.
చాదర్ ఘట్, రసూల్ పూరా, వినాయక్ నగర్ బస్తీలలో కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి బస్తీలలోని ప్రజలను ఖాళీ చేయించారు. భారీ పోలీసుల భద్రతల మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు. అక్కడి ఖాళీ చేసిన వారికి లోకల్ గా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించి అక్కడికి తరలిస్తున్నారు. దాదాపు ఆయా ప్రాంతాలలోని ప్రజలంతా కూడా స్వచ్ఛందంగానే ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. దీనితో రెవెన్యు అధికారులు వారిని కూడా ఒప్పించి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు వందకు పైగా ఇళ్లను ఖాళీ చేయించారు. ఇక మూసి నదికి ఆనుకుని ఉన్న ఇళ్లకు ఇప్పటికే ఆర్ బి ఎక్స్ అనే మార్కింగ్ ను చేశారు. నిన్న మొన్నటి వరకు మా ఇళ్ల జోలికి వస్తే ఊరుకోము అన్న ప్రజలే.. ఇప్పుడు అధికారులకు సహకరించి ఇల్లు ఖాళీ చేస్తున్నారు. అధికారులు కూడా వారి అడిగిన నష్టపరిహారాన్న చెల్లించడానికి ఒప్పుకుంటున్నారు.
మొదట ఈ కూల్చివేతలు హైడ్రానే ప్రారంభించింది. దీనితో నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ ఏ కూల్చివేతలు జరిగినా హైడ్రా అనే అనుకున్నారు. ప్రజల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. కానీ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరుస ప్రకటనలు చేయడంతో.. అందరికి ఓ క్లారిటీ వచ్చింది. హైడ్రా పేదల ఇళ్ల జోలికి వెళ్ళదు.. అంతే కాకుండా నివాసం ఉండే ఇళ్లను కూడా కూల్చదు అని చెప్పారు. ప్రకృతి వనరుల పరిరక్షణ , చెరువులు ,కుంటలు , నాళాలను కాపాడడం , వర్షాలు , వరదల సమయంలో రహదాసరులు నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం మాత్రమే హైడ్రా విధి విధానాలు అంటూ రంగనాథ్ చేసిన పోస్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతం మూసి పరివాహక ప్రాంతాల్లో జరిగే కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. మరి పాతబస్తీలో కూల్చివేతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.