iDreamPost
android-app
ios-app

HYDRA నోటీసులపై మురళీమోహన్ రియాక్షన్! ఏమన్నారంటే..

Murali Mohan: భాగ్య నగరిలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఆక్రమణలకు పాల్పడితే సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తాజాగా మురళీ మోహన్ సంస్థకు నోటీసులు ఇచ్చింది.

Murali Mohan: భాగ్య నగరిలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఆక్రమణలకు పాల్పడితే సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తాజాగా మురళీ మోహన్ సంస్థకు నోటీసులు ఇచ్చింది.

HYDRA నోటీసులపై మురళీమోహన్ రియాక్షన్! ఏమన్నారంటే..

హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ కట్టాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కొరడా ఝుళిపిస్తోంది. ఎవరు ఆక్రమణలకు పాల్పడినా సహించడం లేదు. సామాన్యులే కాదు సెలబ్రిటీలైనా సరే ఊపేక్షించడం లేదు. నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సైతం హైడ్రా కూల్చి వేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. అక్రమ కట్టడాలు అని తేలితే వాటిని కూల్చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. హైడ్రా తీసుకుంటున్న చర్యలతో భాగ్య నగరిలో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. బఫర్ జోన్స్‌లో కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

తాజాగా ప్రముఖ నటుడు, నిర్మాత, రియల్ ఎస్టేటర్ మురళీ మోహన్‌కు షాక్ ఇచ్చింది హైడ్రా. ఆయన రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరికి నోటీసులు జారీ చేసింది. భాగ్యనగరిలోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగాళ్‌కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు అధికారులు. ఈ మేరకు అక్రమ కట్టడాలను పరిశీలించిన కమీషనర్ రంగనాథ్, ఇతర అధికారులు జయభేరి సంస్థ 3 అడుగుల మేరకు రేకుల షెడ్ నిర్మించినట్లు గుర్తించారు. దీంతో మురళీ మోహన్‌కు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా అక్రమ కట్టడాలు తొలగించాలని లేకుంటే కూల్చేస్తామని హైడ్రా హెచ్చరించింది.

కాగా, నోటీసులపై మురళీ మోహన్ స్పందించారు. తాను 33 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్నానని, అక్రమాలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని తెలిపారు. బఫర్ జోన్‌లో షెడ్ ఉందని, దాన్ని మేమే తొలగిస్తామని తెలిపారు. స్థానిక ఫిర్యాదుతో అధికారులు అక్కడకు వచ్చారని, ఏనాడు అవకతవకలకు పాల్పడలేదని, మంగళవారం లోపు తాము ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్‌ను తొలగిస్తామని చెప్పారు. అక్రమ కట్టడాలపై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు హైడ్రా. మియాపూర్, మాదాపూర్, దుండిగల్ ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేస్తుంది సంస్థ.

 తాజాగా దుండిగల్‌ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని అక్రమ విల్లాలు, మదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.  మియాపూర్‌లోని స్వర్ణపురి కాలనీలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సంగాారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లోనూ హెచ్‌ఎంటీ నగర్‌, వాణి నగర్‌లో  అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.  ఇక బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సహకారంతో ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.