iDreamPost
android-app
ios-app

KBR పార్క్ వద్ద మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టమ్.. ఇక ఆ సమస్యలకు చెక్!

KBR Park In Hyderabad: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని  కేబీఆర్ పార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ నిత్యం ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పార్కింగ్ సమస్య బాగా ఉంది. దీంతో జీహెచ్ ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

KBR Park In Hyderabad: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని  కేబీఆర్ పార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ నిత్యం ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పార్కింగ్ సమస్య బాగా ఉంది. దీంతో జీహెచ్ ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

KBR పార్క్ వద్ద మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టమ్.. ఇక ఆ సమస్యలకు చెక్!

నగరాల్లో వివిధ రకాల సమస్యల ఉంటాయి. అలాంటి వాటిల్లో పార్కింగ్ సమస్య ఒకటి. థియేటర్లు, పార్కుల, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ట్రాఫిక్ సమస్య అనేది ఉంటుంది. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వాలు, అధికారులు అనేక చర్యలు తీసుకుంటారు. అయినా కూడా పెరుగుతున్న జనాభాకు ఈ సమస్యలు అనేవి ఇంకా తగ్గడం లేదు. ఇదే సమయంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించి..కొత్త పద్దతుల్లో సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ విషయంలో జీహెచ్ ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరీ.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని  కేబీఆర్ పార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ నిత్యం ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. అంతేకాక పార్క్ ను సందర్శించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. దీంతో పార్క్ ముందు పార్కింగ్ సమస్య  ఉండేది. ఈ క్రమంలోనే పార్కింగ్ సమస్యను తగ్గించేందుకు జీహెచ్ ఎంసీ ఓ నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం నవ నిర్మాణ్ అసోసియేట్స్ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

కేబీఆర్ పార్క్‌ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తోంది. ఇక ప్రజల విజ్ఞప్తి మేరకు, అక్కడి సమస్యను దృష్టిలో ఉంచుకుని మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు సిద్ధమవుతోన్నారు. 405 చదరపు మీటర్లలో ఈ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 72 కార్లను పార్కింగ్ చేసేందుకు కార్ స్పేస్‌లను కలిగి ఉంటుంది. కేబీఆర్ పార్క్‌ లోని మల్టీ-లెవల్ పార్కింగ్ సిస్టమ్ లో మొత్తం ఖాళీలలో 20 శాతం బైకులకు కూడా కేటాయించనున్నారు. ఈ సదుపాయం డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ , ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో నిర్మించబడుతుంది.  ఇక ఈ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత పలు నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ఈ పార్కింగ్ సదుపాయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పార్కింగ్  కోసం టికెట్ కూడా ఉంటుంది. మెషీన్ల ద్వారా టికెట్లు అందజేయనున్నారు. స్మార్ట్ కార్డులను వినియోగించి కూడా టికెట్ పొందవచ్చు. పార్కింగ్ సదుపాయాన్ని నావిగేట్ చేయడానికి, పార్కింగ్‌ ప్లేస్ ను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలానే ఇతర సేవలను కోసం పార్క్ సందర్శకులకు సహాయపడేందుకు మొబైల్ యాప్ ద్వారా అందించనున్నారు.  మొత్తంగా కేబీఆర్ పార్క్‌ వద్ద పార్కింగ్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్ననగర వాసులకు ఈ కొత్త సౌకర్యం ఉపశమనం కలిగించే ఛాన్స్ ఉంది. మరి..కేబీఆర్ పార్క్ పార్కింగ్ విషయంలో జీహెచ్ ఎంసీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.