iDreamPost
android-app
ios-app

హైడ్రాకి మరిన్ని పవర్స్! నేరుగా FIR నమోదు చేసే వెసులుబాటు..

More Powers And Police Station Status To HYDRA: హైడ్రాకు మరిన్న పవర్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక నుంచి మరింత దూకుడుగా వ్యవహరించేందుకు ఆస్కారం కూడా కనిపిస్తోంది. ఇప్పటివరకు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నారు.

More Powers And Police Station Status To HYDRA: హైడ్రాకు మరిన్న పవర్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక నుంచి మరింత దూకుడుగా వ్యవహరించేందుకు ఆస్కారం కూడా కనిపిస్తోంది. ఇప్పటివరకు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నారు.

హైడ్రాకి మరిన్ని పవర్స్! నేరుగా FIR నమోదు చేసే వెసులుబాటు..

హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా).. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ల గురించే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉంటే అక్కడకు బుల్డోజర్స్ తో వెళ్లిపోతున్నారు. అక్రమ నిర్మాణం అని తేలితే నిర్మొహమాటంగా కూల్చేస్తున్నారు. శనివారం హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. నాగార్జున మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనది అక్రమ నిర్మాణం కాదని నాగార్జున.. ఆక్రమణే అని హైడ్రా వాదిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హైడ్రాకి మరిన్ని పవర్స్ అందబోతున్నాయని తెలుస్తోంది. నేరుగా పీఎస్ హోదా కల్పిస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే నేరుగా హైడ్రాకే FIR నమోదు చేసే వెసులుబాటు ఉంటుంది.

హైడ్రాకు మరిన్న పవర్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. హైడ్రాకు నేరుగా పోలీస్ స్టేషన్ హోదా కల్పిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందని తెలుస్తోంది. ఒకవేళ హైడ్రాకు పీఎస్ హోదా దక్కితే.. నేరుగా ఫిర్యాదులు తీసుకోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా హైడ్రానే చేస్తుంది. అదే జరిగితే ఆక్రమణలు, కబ్జాలు, అక్రమ కట్టడాలను నేలమట్టం చేసే పని ఇంకా సులభతరం అవుతుంది అంటున్నారు. ఈ విషయానికి సంబంధించి మరో రెండ్రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు హైడ్రా చూపించి కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఇకపై చూస్తారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆక్రమణ, అక్రమ కట్టడం అని ఏది తేలినా దానిని నేలమట్టం చేసేస్తున్నారు. ఆ భవనం ఎంత పెద్ద వారికి చెందింది అయినా కూడా అస్సలు వెనుకాడటం లేదు.
ఇప్పటివరకు 600 ఫిర్యాదులు:

హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది నేరుగా కలిసి పర్సనల్ గా ఫిర్యాదులు అందజేస్తుంటే.. ఇంకొందరు ఈమెయిల్స్ ద్వారా, పోస్టుల ద్వారా కూడా ఫిర్యాదులు పంపుతున్నారంట. ఇప్పటివరకు హైడ్రాకు 600కు పైగా ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు. అయితే ఫిర్యాదు రాగానే కూల్చివేతలు మొదలు పెట్టరు. ఆ ఫిర్యాదు సరైందేనా? ఆ భవనం అక్రమ కట్టడమా అని తేల్చేందుకు ప్రత్యేక బృందం పని చేస్తుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ సహా ఇరిగేషన్ డిపార్టుమెంట్లతో కూడిన అధికారులు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. అనుమతులు తీసుకున్నారా? అనుమతులు లేకుండానే నేరుగా నిర్మించారా అనే విషయాలను తెలుసుకుంటారు.

అలాగే ఒక నిర్మాణానికి సంబంధించి ఫిర్యాదు అందితే.. అక్కడ ఆ భవనమే ఉందా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ మ్యాప్స్ తో మాత్రమే కాకుండా.. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా ఈ పరిశీలన జరుగుతుంది. అంతేకాకుండా.. ఫీల్డ్ కి పంపి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ చర్యలకు సంబంధించి హైడ్రాపై అలాగే ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైడ్రాకి మరిన్ని పవర్స్ వస్తున్నాయి అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.