iDreamPost
android-app
ios-app

Hyderabad కు మరో భారీ పెట్టుబడి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెజాన్

  • Published Aug 11, 2024 | 6:28 PM Updated Updated Aug 11, 2024 | 6:28 PM

Amazon Web Services-Hyderabad: అమెజాన్ భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఆ వివరాలు..

Amazon Web Services-Hyderabad: అమెజాన్ భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఆ వివరాలు..

  • Published Aug 11, 2024 | 6:28 PMUpdated Aug 11, 2024 | 6:28 PM
Hyderabad కు మరో భారీ పెట్టుబడి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెజాన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి పెట్టుబడులే తేవడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసింది. ఎన్నారైలు, బిజినెస్ మ్యాన్ లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరిస్తూ.. ఇన్వెస్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఆ వివరాలు..

పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. ఆ ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తింది. ఇప్పటికే పలు కంపెనీలు.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెజాన్ చేరింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టిన కంపెనీ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను విస్తరించేందుకు.. అంగీకారం తెలిపినట్లు సమాచారం.  అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు.

Amazon

ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ తన కంపెనీ కార్యకలాపాలను విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేశారు. అంతేకాక అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు సంబంధించి ఇప్పటికే హైదారాబాద్‌లో మూడు డేటా సెంటర్లు పని చేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను పంచుకున్నారు కంపెనీ ప్రతినిధులు.

ఈ సందర్భంగా.. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని.. తమ ప్రభుత్వం  తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు అమెజాన్ ప్రతినిధులు.