iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా!

Hyderabad News: ఎంతో మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ల సమాచారం కోసం ఎందురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది

Hyderabad News: ఎంతో మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ల సమాచారం కోసం ఎందురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా!

నేటికాలంలో నిరుద్యోగం ఒక సమస్యగా మారింది. ఏటా లక్షల మంది చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే..మరి కొందరు  ప్రైవేటు సెక్టార్ లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. నిరుద్యోగ తీవ్ర ఏ స్థాయిలో ఉందో తెలియజేసేలా  అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలాంటే.. నిరుద్యోగులు ఉద్యోగం, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే జాబ్ కి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చిన నిరుద్యోగులకు అది పండగలాంటి వార్తే..

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. జాబ్ కోసం ఎదురు చూస్తున్న యువత కోసం హైదరాబాద్ లో  మెగా జాబ్ మేళా జరగనుంది. ఆగస్టు 20న నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్, సాఫ్ట్ వేర్, బ్యాంకింగ్, విద్యారంగం, టెక్నికల్, మార్కెటింగ్ వంటి తదితర విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. ఇదే విషయాన్ని జాబ్ మేళా నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాక ఆ జాబ్ మేళాకు సంబంధించి పలు కీలక విషయాలను తెలిపారు. మంగళవారంన నాంపలిలో జరగనున్న జాబ్ మేళాలో ఫార్మా,హెల్త్, ఐటీ, మార్కెటింగ్ వంటి తదితర ఇండస్ట్రీలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొననున్నట్లు నిర్వహకులు తెలిపారు.  ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

megha job mela in hyderabad

ఇక ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు కనీసం పదవ తరగతిలో ఉతీర్ణులై ఉండాలి. ఆసక్తిగల అభ్యర్తులు మరిన్ని వివరాల కోసం 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చు. తరచూ ఇలాంటి జాబ్ మేళాలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. అంతేకాక ఈ జాబ్ మేళా ద్వారా పలువురు ఉద్యోగాలు కూడా సాధిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లో జరగనున్న ఈ జాబ్ మేళా నిరుద్యోగులకు మంచి అవకాశమని నిర్వహకులు తెలిపారు. ఇటీవలే ఓ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో 100 పోస్టులకు  నోటిఫికేషన్ ఇవ్వగా.. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో తోపులాట జరిగింది. అలానే ముంబైలోని ఓ ఎయిర్ పోర్టులో కూడా వేలాది మంది నిరుద్యోగులు జాబ్ కోసం చేరుకున్నారు. ఈ రెండు ఇష్యూలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తుంటారు.