iDreamPost
android-app
ios-app

వీడియో: హైదరాబాద్ లో బురఖా ధరించి బైక్ ప్రమాదకర స్టంట్స్..! సీన్ కట్ చేస్తే..

Hyderabad News: ఈ మధ్యకాలంలో కొందరు యువత వెర్రీ వేషాలు వేస్తున్నారు. బైక్ లపై శృతిమించి ప్రవర్తిస్తూ..ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా కొందరు యువకులు బురఖా ధరించి బైక్ పై ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. సీన్ కట్ చేస్తే..

Hyderabad News: ఈ మధ్యకాలంలో కొందరు యువత వెర్రీ వేషాలు వేస్తున్నారు. బైక్ లపై శృతిమించి ప్రవర్తిస్తూ..ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా కొందరు యువకులు బురఖా ధరించి బైక్ పై ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. సీన్ కట్ చేస్తే..

వీడియో: హైదరాబాద్ లో బురఖా ధరించి బైక్ ప్రమాదకర స్టంట్స్..! సీన్ కట్ చేస్తే..

నేటికాలంలో యువత సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. మరికొందరికి అయితే ఏకంగా సామాజిక మాద్యామాలకు బానిసలు మారుతున్నారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. లైకులు, షేర్ల కోసం పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. వెరైటీ వీడియోలు చేయాలని పెడధోరణితో ప్రమాదాల భారీన పడుతున్నారు. మరికొందరు అయితే బైక్ లపై స్టంట్స్ చేస్తూ.. పబ్లిక్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  తాజాగా బురఖా ధరించి ఓ యువకుడు బైక్ పై ప్రమాదక స్టంట్స్ చేశాడు. ఈ ఘటన  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీన్ కట్ చేస్తే వారు ఊహించిన షాక్ తగిలింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్త వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ పాతబస్తీలోనూ కొందరు యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందు కోసం పిచ్చి వేషాలు వేస్తూ రోడ్లపై ప్రమాదకర స్టంట్స్ చేశారు. రద్దీగా ఉన్న రోడ్లపై తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాక బైక్ పై రెచ్చిపోతూ విన్యాసాలు చేస్తూ.. తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశారు. ఓ యువకుడే అమ్మాయిలా బురాఖ ధరించి విన్యాసాలు చేశాడు. తాము ఏదో దేశాన్ని ఉద్దరించే పని చేసినట్లు వీడియో సైతం తీశారు. అలా ఆ యువకులు స్టంట్స్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇక ఆ ఈ వీడియోలను షేర్ చేసిన కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్ర నేరమని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే మిగిలిన వారు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని నెటిజన్లు డిమాండ్ చేశారు. తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసే హక్కు వారికి ఎవరికి లేదంటూ మండిపడుతున్నారు. అంతేకాక గత కొంత కాలంగా బైక్ రేసింగ్, బైక్స్ పై స్టంట్స్ వంటివి ఎక్కువయ్యాయి. వాహనదారులను ఇబ్బందులకు గురిచేసిన ఆ యువకుల వీడియోలు  చివరకు పోలీసులకు చేరాయి.

దీంతో రంగంలోకి దిగిన సిటీ పోలీసులు.. వీడియోలో స్టంట్స్ చేసిన యువకులను అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి బైకులను సీజ్ చేశారు. ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగేలా కఠిన చర్యలు తీసుకుంటామాని పోలీసులు హెచ్చరించారు. వాహనాలకు సంబంధించి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిలే ఎవరు ప్రవర్తిస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఇదే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తను పరిశీలిస్తుండాలని చెబుతున్నారు. మరి..ఇలాంటి ఆకతాయిలకు ఎలాంటి శిక్షలు వేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.