iDreamPost
android-app
ios-app

Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్స్ బంద్!

Hyderabad News: ఇటీవల తరచూ బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. రాబోయే పండగలను, ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు బంద్ చేస్తుంటారు. తాజాగా మరోసారి తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది.

Hyderabad News: ఇటీవల తరచూ బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. రాబోయే పండగలను, ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు బంద్ చేస్తుంటారు. తాజాగా మరోసారి తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది.

Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్స్ బంద్!

నేటికాలంలో ఫంక్షన్ ఏదైనా సరే మద్యం ఉండాల్సిందే. మద్యం చుక్క లేకుండా దాదాపు ఏ వేడుక జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక వీకెండ్స్, ప్రత్యేక కార్యక్రమాల్లో అయితే కొందరు మద్యంలో  మునిగితేలుతుంటారు. ఇక కొందరికి అయితే చుక్క పడనిదే రోజు గడవని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడెప్పుడు వైన్స్ ఓపెన్ చేస్తారా అని వెయ్యి కళ్లతో  చూస్తుంటారు. సందర్భం ఏదైనా సరే..మద్యంతో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అన్నట్టు తయారయ్యారు జనాలు. ఒక్కరోజు మద్యం షాపులు మూసి ఉన్న కూడా మద్యం ప్రియులు విలవిల్లాడిపోతుంటారు. ఇలాంటి వారికి బ్యాడ్ న్యూస్. మద్యం షాపులు రెండు రోజుల పాటు బంద్ కానున్నాయి. ఏ కారణంతో బంద్ కానున్నాయి?. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. భక్తి శ్రద్ధలతో గణేషుడికి పూజలు చేస్తూ.. భక్తి భావంలో మునిగితేలుతున్నారు. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న వినాయ చవితి పండుగ నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గణేషుడు నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం షాపులు మూసి వేయాలని నిర్ణయించారు.

గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో లో రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో వైన్స్ షాపులు మూసివేయబడనున్నాయి. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు , బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వూలు జారీ చేశారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ కి ఇది వర్తించదని పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీన ఖైరతాబాద్ వినాయకుడితో సహా నగరంలోని వివిధ గణేషుడి విగ్రహాలు నిమర్జనం కానున్నాయి.

ఈ నేపథ్యంలో శాంత్రి భద్రతలకు భంగం కలగకుండా, ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంలోని అన్న మద్యం, కల్లు దుకాణాలు మూసేవేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించి.. షాపులు ఓపెన్ చేస్తే..కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇక ఈ ఏడాది కూడా వినాయక నిమజ్జనంకి హైదరాబాద్ నగర అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవలే హుస్సేన్ సాగర్ లో వినాయకుల విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులు విచారణ జరిగింది. చివరకు హుస్సేన్ సాగర్ లో గణేషుడి నిమజ్జనంకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో ఈసారి కూడా ఘనంగా వినాయకుడి నిమజ్జనం వేడుకలు జరుపుకునేందుకు నగర వాసులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17, 18..రెండు రోజుల పాటు వైన్స్ ను బంద్ చేయనున్నారు.  ఇలా పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వైన్ షాపులు మూసివేయడం అనేది జరుగుతూనే ఉంది. అందరికి ఇది మంచి వార్తే అయినా..మందుబాబులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.