iDreamPost
android-app
ios-app

వామ్మో.. వేలంలో కోటీ 87 లక్షలు పలికిన గణపతి లడ్డు! ఎక్కడంటే?

  • Published Sep 17, 2024 | 10:16 AM Updated Updated Sep 17, 2024 | 10:26 AM

Ganesh Laddu Auctioned for Record: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్ధి వేడుకలు ఘనంగా జరిగా. గల్లీ గల్లీలో వినాయ మండపాల్లో గణనాధుడిని ప్రతిష్టించారు. నవరాత్రులు పూజలందుకున్న గణేషుడిని భారీగా ఊరేగింపు చేస్తూ నిమజ్జన కార్యక్రమాలు జరిపిస్తున్నారు.

Ganesh Laddu Auctioned for Record: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్ధి వేడుకలు ఘనంగా జరిగా. గల్లీ గల్లీలో వినాయ మండపాల్లో గణనాధుడిని ప్రతిష్టించారు. నవరాత్రులు పూజలందుకున్న గణేషుడిని భారీగా ఊరేగింపు చేస్తూ నిమజ్జన కార్యక్రమాలు జరిపిస్తున్నారు.

  • Published Sep 17, 2024 | 10:16 AMUpdated Sep 17, 2024 | 10:26 AM
వామ్మో.. వేలంలో కోటీ 87 లక్షలు పలికిన గణపతి లడ్డు! ఎక్కడంటే?

దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి పూజలు భక్తి శ్రద్దలతో జరిపించారు. లంభోదరుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. నగరాలు, పల్లెల నుంచి మండపాల్లో ప్రతిష్టించిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు.  అయితే నిమజ్జనానికి ముందు పూజలందుకున్న గణేశ్ లడ్డూ వేలం వేయడం అనవాయితీగా వస్తుంది. వినాయకుడి లడ్డు వేలంలో దక్కించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. ఒకప్పుడు వేలల్లో వేలం ఉంటే.. ఇప్పుడు లక్షలు, కోట్లకు చేరుకుంది. హైదరాబాద్‌లో మై హూమ్ భుజాలో రూ.29 లక్షలకు లడ్డులను వేలంలో సొంతం చేసుకున్నారు.తాజాగా గణపతి లడ్డు ఏకంగా కోటికి పైగా వేలం పాట పాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఈ వేలం ఎక్కడ పాడారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. స్వామి వారి నిమజ్జనానికి ముందు లడ్డు వేలం పాట పాడారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో వేలం కొనసాగింది. గణేశ్ లడ్డూ ప్రసాదం కోటీ 87 లక్షలు వేలంలో పలకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఇక్కడ లడ్డూ రూ.1.20 కోట్లకు పలికింది. ఈ ఏడాది ఏకంగా రూ.67 లక్షలు మేర పెరిగిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.  లడ్డూ వేలం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేంది బాలాపూర్ గణనాథుడు. గత ఏడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో రూ.27 లక్షలు పలికిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం జరుగుతుంది.. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు లక్షల్లో తరలి వస్తున్నారు. ఇక ఐటీ కారిడార్ పరిధిలోని మై హూం భుజా అపార్ట్ మెంట్ లో గణేశ్ లడ్డూ రికార్డు ధరకు వేలం పాడారు. ఆదివారం నిర్వహించిన వేలం లో ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ రూ.29 లక్షలకు దక్కించుకున్నాడు. కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గనేశ్ లడ్డూ వేలం అన్ని రికార్డులను తిరగరాసిందని అంటున్నారు.   హుస్సేన్ సాగర్‌కు సుమారు 21 కిలో మీటర్ల దూరం నుంచి తరలి వచ్చే బాలాపూర్ శోభాయాత్రే అతి పెద్దది. శోభాయాత్ర పర్యవేక్షణకు పలు మార్గాల్లో 733 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.