భారీ వర్షాలు.. రంగంలోకి హైడ్రా కమిషనర్! కూల్చివేతలే కాదు.. కాపాడేందుకు ముందున్నారు!

Hydraa Commissioner Ranganath: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తు కబ్జాదారులను వణికిస్తుంది హైడ్రా. కూల్చి వేతలే కాదు.. వర్షంలో భాదపడుతున్న బాధితులను కూడా ఆదుకోవడంలో ముందుకు వచ్చింది హైడ్రా.

Hydraa Commissioner Ranganath: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తు కబ్జాదారులను వణికిస్తుంది హైడ్రా. కూల్చి వేతలే కాదు.. వర్షంలో భాదపడుతున్న బాధితులను కూడా ఆదుకోవడంలో ముందుకు వచ్చింది హైడ్రా.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (HYDRA)నగరంలో చెరువులు, నాళాలు, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటినికి కూల్చివేస్తుంది. సినీ, రాజకీయ, వ్యాపారులు ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇచ్చి కూల్చి వేస్తున్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ పరిస్థితుల మధ్య హైడ్రా కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే..

భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాలు నీట మునిగిగాయి. ఇండ్లల్లోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. టోలీ చౌక్, షేక్ పేట్ లో పర్యటించారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, విపత్తు నిర్వహణ ఏజెన్సీలు, డిజాస్టర్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఫోర్స్ తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నగర వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా అమీర్ పేట్, బేగంపేట్, అత్తాపూర్, షేక్ పేట్, గచ్చిబౌలి, టోలీచౌక్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని సూచించారు.

Show comments