iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో ఇల్లు కడుతున్నా, కొంటున్నా ఇకపై ఈ NOC తప్పనిసరి!

  • Published Sep 11, 2024 | 11:10 AM Updated Updated Sep 11, 2024 | 11:10 AM

Hydra Permit Mandatory: ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘హైడ్రా’ పేరు మారుమోగుతుంది. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమించి కట్టిన కట్టడాలను బుల్డోజర్లను ప్రయోగిస్తూ కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.

Hydra Permit Mandatory: ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘హైడ్రా’ పేరు మారుమోగుతుంది. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమించి కట్టిన కట్టడాలను బుల్డోజర్లను ప్రయోగిస్తూ కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.

  • Published Sep 11, 2024 | 11:10 AMUpdated Sep 11, 2024 | 11:10 AM
హైదరాబాద్‌లో ఇల్లు కడుతున్నా, కొంటున్నా ఇకపై ఈ NOC తప్పనిసరి!

గత కొంత కాలంగా హైదరాబాద్ లో కొంతమంది కబ్జాదారులు చెరువులన పూడ్చేసి, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ చేసి అమాకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది తెలియని అమాయకులు ఆ స్థలంలో నిర్మాణాలు చేపడ్డం.. హైడ్రా వాటికి నోటీసులు ఇవ్వడంతో లబోదిబో అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా’ అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తుంది. జీహెచ్ఎంసీతో పాటు సిటీ లిమిట్స్ లోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో కూడా హైడ్రా పేరు చెబితే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా హైదరాబాద్ లో ఇళ్లు నిర్మాణం చేసే వారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో భవనాలు నిర్మించే వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై చెరువుల, నాలాలలకు సమీపంలో నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలకు హైడ్రా నుంచి నిరభ్యంతర ధృవీకరణ (NOC)ఉంటేనే నిర్మాణాలకు అనుమతి జారీ చేసే విధంగా నిబంధనలను సవరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ రూల్స్ అతిక్రమించి నిర్మాణాలు చేబడితే ఇంటి నంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణలపై పురపాలక శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది అమలులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ లో గృహ కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

NOC mandatory for new constuctions in HYD

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు అక్రమంగా అధికారుల నుంచి అక్రమంగా అనుమతులు పొంది చెరువులు, నాలాలు ఆక్రమించి స్థలాలు ఏర్పాటు చేసి అమాయకులకు అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ‘హైడ్రా’ రంగంలోకి దూకింది. ఇదిలా ఉంటే హైడ్రా పనితీరుతో స్థిరాస్తి కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొంది. ఎక్కడ స్థలాలు కొనాలి.. అవి నిజమైన డాక్యుమెంట్స్ అవునా? కాదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో గృహ కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో ప్రభుత్వ ఆదాయనికి గండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొనుగోలుదారులకు భరోసా కలిగించేందుకు నిర్మాణ అనుమతులు జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.

గతంలో చాలా మంది బిల్డర్లు, రియర్ ఎస్టేట్ వ్యాపారులు రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ (రెరా) కన్నా ముందు నిర్మాణ అనుమతులు రాకముందే అడ్వర్టైజ్ మెంట్స్, ఏజెంట్లను సమకూర్చుకొని వినియోగదారులకు అమ్మేవారు. తీరా న్యాయపరమైన చిక్కులు రాగానే అనుమతులు రాకపోవడంతో కస్టమర్లు లబో దిబో అనే పరిస్థితులు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను కొనుగోలుదారులను కాపాడేందుకు కేంద్రం ‘రెరా’ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ యాక్ట్ వల్ల స్థిరాస్థి రంగంలో పెట్టుబడిదారులకు భద్రత, పారదర్శకత, నమ్మకం ఉంటుంది. ఈ క్రమంలోనే రెరా అమోదం పొందిన ప్రాజెక్టులలో కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక నుంచి హైదరాబాద్ లో భవన నిర్మాణాలకు రెవెన్యూ. ఇరిగేషన్, ఫైర్, ఎన్విరాన్ మెంట్ శాఖల ఎన్ఓసీ తప్పనిసరి.. అదే విధంగా ఇప్పుడు హైడ్రా నుంచి ఎన్ఓసీ కూడా తప్పని సరి కావాల్సిందే. ఇలా చేయడం వల్ల చెరువులు, నాలాలు కబ్జా కాకుండా సురక్షితంగా ఉంటాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.