iDreamPost
android-app
ios-app

గ్యాప్ దొరికితే తాట తీస్తున్న హైడ్రా.. బిల్డింగ్స్ కూల్చాకా కూడా వదలడం లేదు!

HYDRA Key Decisions In Hyderabad: గ‌త కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రా.. తాజాగా అక్రమ నిర్మాణదారులకు మరో షాక్ ఇచ్చింది.

HYDRA Key Decisions In Hyderabad: గ‌త కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రా.. తాజాగా అక్రమ నిర్మాణదారులకు మరో షాక్ ఇచ్చింది.

గ్యాప్ దొరికితే తాట తీస్తున్న హైడ్రా.. బిల్డింగ్స్ కూల్చాకా కూడా వదలడం లేదు!

హైడ్రా.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూలుస్తూ.. ఆక్రమణదారుల పాలిటీ సింహస్వప్నంలా మారింది హైడ్రా.  గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో  హైడ్రా చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. అక్రమకట్టాలను నేలమట్టం చేస్తూ..దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక అక్రమకట్టడాలను నేలమట్టం చేసి..అక్రమ నిర్మాణదారులకు షాకిస్తున్న హైడ్రా ..తాజాగా మరో షాక్ ఇచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

అక్రమంగా నిర్మించన ఫాహౌస్ లు, ఇతర భవనాలను నేలమట్టం చేసిన తరువాత వాటిని ఎలా తరరలించాలి. అందుకు అయ్యేఖర్చు ఎవరు భరిస్తారు అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణదారులకు హైడ్రా షాకిచ్చింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చు మొత్తం వారే భరించాల్సి ఉంటుందని హైడ్రా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాత్ కీలక విషయాలను ప్రస్తావించారు. అక్రమ భవనం కూల్చివేతలకు సంబంధించి బుల్డోజర్లు, వాటికి అయ్యే ఇంధనం, ఆపరేటర్ కు జీతం, కూల్చివేతల తర్వాత ఏర్పడే వ్యర్థాల తరలింపు వంటి వాటికి అయ్యే ఖర్చు మొత్తం అక్రమ నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హైడ్రా కమిషనర్‌ తేల్చిచెప్పారు. ఈ నిర్ణయం అమలు చేసేందుకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్ఆర్ యాక్ట్ కింద ఈ మొత్తం ఖర్చును నిర్మాణదారులు దగ్గర నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన తెలిపారు. అదే విధంగా ఇప్పటి వరకు హైడ్రా ద్వారా కూర్చిన భవన సంఖ్యను కూడా ఆయన తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలోని 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇందులో పలు భారీ నిర్మాణాలు కూడా ఉండడంతో వ్యర్థాలు పెద్ద ఎత్తున ఏర్పడిందని, ఆక్రమణలు తొలగించడంతో పాటు చెరువులను పూర్వ స్థితిలోకి తీసుకురావడానికి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపాల్సి ఉంటుందని, ఆయన తెలిపారు. అంతేకాక భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జరగకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పేర్కొన్నారు.

తాజాగా అక్రమణ నిర్మాణాల కూల్చివేతతో ఏర్పడిన వ్యర్థాలను తరలిపుంతో పాటు చెరువులు భద్రత ఏర్పాట్లకు కోట్లలో ఖర్చుఅవుతుందని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం హైడ్రా వద్ద ఆ స్థాయిలో నిధులేవని ఆయన తెలిపారు. వ్యర్థాల తరలింపుతో పాటు ఈ ఏర్పాట్లకు రూ.కోట్లలో ఖర్చవుతుందని ఆయన వివరించారు. అయితే, హైడ్రా వద్ద ప్రస్తుతం నిధులు ఆ స్థాయిలో లేవని ఆయన వివరించారు. రెండు రోజుల క్రితం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన సంగతి తెలిసింది. ఇక్కడ దాదాపు చిన్నా పెద్దా నిర్మాణాలు పది వరకు ఉన్నాయి. వీటిని కూల్చివేయడానికి భారీ యంత్రాలను వినియోగించారు.  ఇప్పుడు ఆ ప్రాంతాల నుంచి ఇనుప వస్తువులతో నిండి ఉనన శిథిలాలను తొలగించడం కత్తిమీద సాములా మారింది. దీంతో ఎన్ కన్వెన్షన్  నిర్మాణల వ్యర్థాలను తొలగించడానికి అయిన ఖర్చును నాగార్జునానే భరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇలా గ్యాప్ దొరికేతే హైడ్రా అక్రమకట్టడాలు, వాటి ఓనర్లపై ఓ రేంజ్ లో విరుచుక పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.