iDreamPost
android-app
ios-app

జల విహార్‌పై హైడ్రాకు ఫిర్యాదు.. చర్యలు తీసుకుంటారా?

  • Published Sep 19, 2024 | 12:01 PM Updated Updated Sep 19, 2024 | 12:05 PM

Jalavihar in Hyderabad: గత కొన్నిరోజులుగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ కొరడా ఝులిపిస్తుంది. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టడాలు నిర్మించినాటిని బుల్డోజర్లతో కూల్చి వేస్తుంది.

Jalavihar in Hyderabad: గత కొన్నిరోజులుగా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ కొరడా ఝులిపిస్తుంది. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టడాలు నిర్మించినాటిని బుల్డోజర్లతో కూల్చి వేస్తుంది.

  • Published Sep 19, 2024 | 12:01 PMUpdated Sep 19, 2024 | 12:05 PM
జల విహార్‌పై హైడ్రాకు ఫిర్యాదు.. చర్యలు తీసుకుంటారా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. నగరంలో వరదల కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. ఇందుకు కారణం అక్రమ కట్టడాలనే.. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు నేలమట్టం చేసి భవిష్యత్ లో ఎలాంటి వరదలు రాకుండా చూసుకునే క్రమంలో ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సర్కార్.  అనుమతి లేకుండా చేపట్టిన కట్టడాలు, చెరువులు, నాలాలు కబ్జా చేసిన నిర్మించిన కట్టడాలను కూల్చివేసే పనిలో ఉంది హైడ్రా. ఇటీవల మాదాపూర్ లోని హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేసింది. తాజాగా జల విహార్ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్ లో ఉన్న జల విహార్ గురించి తెలియని వారు ఉండరు.ఇతర జిల్లాల నుంచి విహారయాత్రలకు వచ్చిన వారు తప్పకుండా జల విహార్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా వాటర్ గేమ్స్, రైడ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా జల విహార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందాయి. పర్యావరణ నిబంధనలు, కోర్టు ఆదేశాలు పాటించకుండా పూర్తి విరుద్దంగా హుస్సేన్ సాగర్ పరిధిలోని స్థలాన్ని ఆక్రమించి జల విహార్ ఏర్పాటు చేశారని.. దానిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఎన్ బాలమల్లేశ్, పశ్య పద్మతో కూడిన బృందం బుధవారరం హైడ్రా కమీషనర్ రంగనాథన్ కి కలిసి విన్నించింది.

హుస్సేన్ సాగర్ స్థలాన్ని ఆక్రమించి జల విహార్ చేపడుతున్న కార్యకలాపాల కారణంగా సాగర్ లోని లక్షలాది జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వారు సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అడుగులు ముందుకు వేస్తున్న హైడ్రా ఈ విషయంలో జోక్యం చేసుకొని కోర్టు కేసులు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించి చర్యల తీసుకోవాలని ప్రతినిధి బృందం కోరింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కూల్చి వేస్తుందని కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. అప్పటి నుంచి నిషేదిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినవాటిని నోటీసులు ఇస్తూ బుల్డోజర్లతో కూల్చివేస్తూ వస్తున్నారు. హైడ్రా చర్యలను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తే.. తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.