Swetha
Hydra Commissioner Ranganath: మొన్నటి వరకు దూకుడుగా దూసుకుపోయిన హైడ్రా కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ప్రజలకు సర్ది చెప్పి.. వారిని బెదిరించి కాకుండా ఒప్పించి హైడ్రా కూల్చివేతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
Hydra Commissioner Ranganath: మొన్నటి వరకు దూకుడుగా దూసుకుపోయిన హైడ్రా కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ప్రజలకు సర్ది చెప్పి.. వారిని బెదిరించి కాకుండా ఒప్పించి హైడ్రా కూల్చివేతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
Swetha
నిన్న మొన్నటి వరకు హై స్పీడ్ లో దూసుకుపోయిన హైడ్రాకు బ్రేకులు పడ్డాయి. బఫర్ జోన్ కింద ఏ భవనం కనిపిస్తే దానిని క్షణాల్లో నేలమట్టం చేసిన హైడ్రా ఇప్పుడు సైలెంట్ అయింది. దానికి కారణం కేవలం పాతబస్తీలోని ప్రజలు చేసిన పోరాటమే. హైదరాబాద్ లో హైడ్రా సామాన్యుల , పేద వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఏ క్షణంలో నోటీసుల వస్తాయా అని బిక్కు బిక్కు మంటూ ఇళ్లలో తల దాచుకున్నారు ప్రజలు. రూపాయి రూపాయి పోగు చేసి.. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కళ్ళ ముందు కుప్పకూలిపోతుంటే.. కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక గత వారం మూసి పరివాహక ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. శని ఆదివారాల్లో పని పూర్తి చేయాలనీ అనుకుంది. కానీ అది జరగలేదు.. అక్కడ ప్రజలు తమ ఇళ్ల జోలికి రావొద్దంటూ పోరాడారు. దీనితో హైడ్రా కాస్త వెనక్కు తగ్గింది. ఇక ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్.. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటివరకు అందరికి హైడ్రా అంటే.. కేవలం కూల్చివేతలు మాత్రమే కనిపించాయి. కానీ అసలు హైడ్రా ఏం చేస్తుంది.. ఏం చేయదు అనే స్టేట్ మెంట్ ఇచ్చారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదని.. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు అని ఆయన తెలియజేశారు. అలాగే హైడ్రా పేదల ఇళ్ల జోలికి వెళ్ళదు.. అంతే కాకుండా నివాసం ఉండే ఇళ్లను కూడా కూల్చదు అని చెప్పారు. అంతే కాకుండా ఎక్కడ ఎక్కడ కూల్చివేతలు జరుగుతున్నా హైడ్రా నే అంటున్నారని.. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రకృతి వనరుల పరిరక్షణ , చెరువులు ,కుంటలు , నాళాలను కాపాడడం , వర్షాలు , వరదల సమయంలో రహదాసరులు నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం మాత్రమే హైడ్రా విధి విధానాలు అంటూ రంగనాథ్ పోస్ట్ చేశారు. దీనిని ప్రజలు , సామాజిక మాధ్యమాలు గుర్తించాలి అని ఆయన తెలియజేశారు.
మొత్తం మీద ఇప్పటికి హైడ్రా అందరికి ఓ క్లారిటీ ఇచ్చింది. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూల్చివేతలు జరిగిన హైడ్రానే అంటున్నారు. దీనితో ఇప్పటివరకు హైడ్రా చాలా విమర్శలనే ఎదుర్కొంది. ప్రభుత్వంపైన కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను అపప్రమత్తం చేసి.. వారికి అవగాహన కల్పించే విధంగా హైడ్రా కమిషనర్ వరుస ప్రకటనలు చేసింది. మరి ఇకపై హైడ్రా ప్రజలతో ఎలా ప్రవర్తిస్తుందో వేచి చూడాలి. కానీ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితిలో వారి ఇళ్లను కూల్చేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక అటు రేవంత్ రెడ్డి కూడా ప్రజలను బెదిరించి కాకుండా బుజ్జగించి వారిని ఒప్పించి మాత్రమే.. అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని అంతటా ఉత్కంఠ నెలకొంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.