Swetha
Hydra effect on Banks: నిన్న మొన్నటివరకు హైదరాబాద్ ను హడలెత్తించింది హైడ్రా. ప్రస్తుతం హైడ్రా బుల్డోజర్లకు బ్రేకులు పడినట్లే. గతంలో ఉన్నంత స్పీడ్ గా అయితే హైడ్రా లేదు. అయితే హైడ్రా వలన ప్రజలే కాదు .. అటు బ్యాంకులు కూడా తీవ్ర నష్టానికి గురయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Hydra effect on Banks: నిన్న మొన్నటివరకు హైదరాబాద్ ను హడలెత్తించింది హైడ్రా. ప్రస్తుతం హైడ్రా బుల్డోజర్లకు బ్రేకులు పడినట్లే. గతంలో ఉన్నంత స్పీడ్ గా అయితే హైడ్రా లేదు. అయితే హైడ్రా వలన ప్రజలే కాదు .. అటు బ్యాంకులు కూడా తీవ్ర నష్టానికి గురయ్యాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
నిన్న మొన్నటివరకు హై స్పీడ్ తో దూసుకుపోయిన హైడ్రా జోరు తగ్గింది. గత కొన్ని రోజుల నుంచి హైడ్రా బుల్డోజర్లకు బ్రేకులు పడ్డాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ తో స్టార్ట్ అయినా హైడ్రా కూల్చివేతలు.. కొన్ని రోజుల పాటు విరామం లేకుండా కొనసాగాయి. వారు సామాన్యుల , సెలెబ్రిటీల అనే తేడా లేకుండా… అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా.. బఫర్ జోన్ కిందికి వస్తుందా.. అనే దానిపై మాత్రమే ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ధనికుల మాట అటు ఉంచితే ఎంతో మంది సామాన్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలను చూశాము. అయితే ఆ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ కూల్చివేతలన్నీ హైడ్రావి కాదు.. అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పటికే సామాన్యులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటు ప్రజలతో పాటు.. అటు బ్యాంకులు కూడా తీవ్ర నష్టానికి గురయ్యాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంకులకు హైడ్రా ఫీవర్ పట్టుకుంది . హైడ్రా దూకుడితో ఆర్థిక సంస్థలు దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. జల వనరుల సమీపంలోని ఇళ్లకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు కలవర పడుతున్నాయి. ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టేదెలానో అర్థంకాక ప్రశార్థకంగా మారిపోయాయి. అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా బుల్డోజర్లు చాలా భవనాలను క్షణాల్లో నేలమట్టం చేశాయి. దాని కారణంగా ప్రజల కంటే కూడా బ్యాంకులే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయి. హైదరాబాద్ లో 311 పైగా నిర్మాణాలు కూల్చివేశారు. దీనితో బ్యాంకులకు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా . దీనితో ఇంటి రుణాలు తీసుకున్న వ్యక్తులు ఈఎమ్ఐ లు కట్టడం లేదని బ్యాంకులు వాపోతున్నాయి. కూకట్పల్లి , అమీనాపూర్ ప్రాంతాల్లోని ఇళ్లకు చాలా బ్యాంకులు కోట్లలో రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు అక్కడ బాధితుల ఇల్లు కూల్చివేయడంతో.. ఇచ్చిన రుణాలు రాబట్టలేక బ్యాంకులు తర్జన భర్జన పడుతున్నాయి.
ఇప్పటికే చాలా చోట్ల భవన నిర్మాణాలు స్థంబించిపోయాయి. ఇక అధికారులు అక్రమ నిర్మాణాలకు రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు బ్యాంకులు మిగిలిన ఇళ్లకు కొత్త రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. దుండిగల్ , అమీర్ పూర్ , మాదాపూర్ లాంటి ప్రాంతాలు ఇప్పటికే రుణాలకు ఎంపిక అయ్యాయి. ఆ ప్రాంతాలలోని స్థలాలకు అన్ని అనుమతులు ఉన్నాయి. అయినా సరే.. బ్యాంకులు మాత్రం రుణాలు ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. మరి ఈ విషయంలో అధికారులు బ్యాంకులకు ఎలాంటి సాయం అందిస్తారో చూడాలి. ముఖ్యంగా బ్యాంకుల మనుగడకు ఇళ్ల రుణాలే కీలకం. అలాంటిది ఇప్పుడు బ్యాంకులు నష్టం పోవడంతో.. ఆర్థిక సంస్థలు కూడా దెబ్బ తినే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.