OYC- మల్లారెడ్డి కాలేజీలు కూల్చరా? HYDRA కమిషనర్ AV రంగనాథ్ క్లారిటీ..

AV Ranganath Clarity On OYC And Malla Reddy Colleages: ప్రస్తుతం హైడ్రాకి ఎదురవుతున్న అతి పెద్ద సవాళ్లు ఏంటంటే? ఓవైసీ- మల్లారెడ్డి కాలేజీలను కూల్చేసారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు స్వయంగా ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

AV Ranganath Clarity On OYC And Malla Reddy Colleages: ప్రస్తుతం హైడ్రాకి ఎదురవుతున్న అతి పెద్ద సవాళ్లు ఏంటంటే? ఓవైసీ- మల్లారెడ్డి కాలేజీలను కూల్చేసారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు స్వయంగా ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

హైడ్రాకి సంబంధించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 48.94 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి రిపోర్టును కూడా సబ్మిట్ చేశారు. అక్రమంగా నిర్మించిన ఏ కట్టడాన్ని వదిలే ప్రసక్తే లేదు అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎప్పుడో చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు హైడ్రా లొంగదని.. తన పని తాను చేసుకుంటూ పోతుందని మరోసారి స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉన్న వారి భవనాలు అయినా వదలం అని చెప్పారు. ఈ తరుణంలో హైడ్రాకి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మల్లారెడ్డి- ఓవైసీ కళాశాలను కూల్చరా? కూలుస్తారా? రాజకీయ ఒత్తిడికి తలొగ్గుతారా? అని ప్రశ్నిస్తున్నారు. వీటిపై స్వయంగా ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

హైడ్రా ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుండటంపై ప్రజల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంగళవారం బీజేపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసి పలు ఫిర్యాదులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఏవీ రంగనాథ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఓవైసీ కాలేజా? మల్లారెడ్డి కళాశాలా? అనే విషయాలు చూడమని స్పష్టం చేశారు. అలాగే రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారబోదని ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్టీఎల్ అనేది కూడా ఎంతో ముఖ్యమైన అంశం అని రంగనాథ్ అన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్ అంతకన్నా ముఖ్యం అని స్పష్టం చేశారు. చెరువులను ఆక్రమించి కళాశాలలు నిర్మించిన వారి గురించి ఆలోచిస్తాం.. అలాగే విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తామని చెప్పారు.

అందుకే ఓవైసీ, మల్లారెడ్డి కళాశాలకు కొంత సమయం ఇస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా.. హైడ్రా ఎవరికీ నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే.. ధర్మసత్రం అయినా కూల్చే తీరుతాం అని పునరుద్ఘాటించారు. అలాగే కూల్చివేతలు, వాటి తర్వాత జరిగే అంశాలపై ఇప్పటికే రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. కూల్చివేతలకు సంబంధించి, ఆ తర్వాత వ్యర్థాల తొలగింపు అంశాలకు అయ్యే ఖర్చును కూడా భవనాలు నిర్మించిన వాళ్లే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రాకి పోలీస్ స్టేషన్ హోదా కూడా వస్తుందని ఇప్పటికే పలు సందర్భాల్లో ఏవీ రంగనాథ్ వెల్లడించారు. మరి.. ఓవైసీ- మల్లారెడ్డి కళాశాలల విషయంలో హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments